ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో యంగ్ హీరో అరవింద్ కృష్ణ

0
192

ఆలస్యం అమృతం అనే సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌ చేసి అందరినీ మెప్పించాడు అరవింద్ కృష్ణ. అలా తెరపైకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అరవింద్ కృష్ణ ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాతో హీరోగా మారిపోయాడు. రిషి సినిమాలో టైటిల్ రోల్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రిషి సినిమాలో మెడికోగా నటించి ఆడియెన్స్‌ను మెప్పించారు.

ఈడు గోల్డ్ ఎహె సినిమాలో విలన్‌గా కనిపించి అందరినీ భయపెట్టాడు. అలా అప్పటి నుంచి విభిన్న పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఇక ప్రేమమ్ సినిమాలో శ్రుతి హాసన్ పక్కన నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శుక్ర అంటూ అరవింద్ కృష్ణ చేసిన సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో విలన్‌గా నటించాడు. రజినీకాంత్ అన్నాత్తె (తెలుగులో పెద్దన్న) సినిమాలో కీర్తి సురేష్ పక్కన కనిపించి మెప్పించాడు. ఏ మాస్టర్ పీస్ అంటూ రాబోతోన్న సూపర్ హీరో సినిమాలో అరవింద్ కృష్ణ నటిస్తున్నాడు. గ్రే- ది స్పై హు లవ్డ్ మీ అనే సినిమాతో మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు అరవింద్ కృష్ణ.

అరవింద్‌కు ఇప్పుడు ఇతర భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నాడు. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ అరవింద్ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. సినిమాలే కాకుండా.. ఆటల్లోనూ అరవింద్ కృష్ణ అదరగొట్టేస్తుంటాడు. బాస్కెట్ బాల్‌ ఆటలో అరవింద్ కృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్‌లో హైద్రాబాద్‌ తరుపున అరవింద్ ఆడుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here