యాద్గిరి & సన్స్‌ మూవీ రివ్యూ

0
592

టైటిల్‌: యాద్గిరి & సన్స్‌
నటీనటులు: అనిరుధ్, యశస్విని, రోహిత్, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్
సంగీతం: విజయ్ కురాకుల,
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,
నిర్మాత: చంద్రకళ పందిరి,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భిక్షపతి రాజు పందిరి
విడుదల తేదీ: 05-05-2023

యదార్థ సంఘటనలతో సినిమాలు తీయడం కొత్తేం కాదు. మర్డర్‌ మిస్టరీస్‌, ఇన్విస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌‌ తెలుగు తెరపై ఇప్పటికే ఎన్నో వచ్చాయి. ఇలాంటి జోనర్‌‌కు మినిమమ్‌ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. అలాంటి జోనర్‌లో వచ్చిందే యాద్గిరి అండ్ సన్స్‌. మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన వాస్తవ సంఘటనతో తీసిన ఈ సినిమాపై టీజర్‌ మరియు ట్రైలర్‌లతో ఆడియెన్స్‌లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. మెసేజ్ కూడా జోడించి తీసమని మేకర్స్ చెప్పడంతో సినిమాపై క్యూరియాసిటి పెరిగింది. మరి అందుకు తగ్గట్టే ఈ సినిమా ఉందా.. వారు చెప్పాలనుకున్న మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

హైదరాబాద్‌ సిటీలో మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో బ్రతికే ఆటోవాలా యాద్గిరి (జీవా). అతనికి ఇద్దరు కొడుకులు లక్ష్మణ్, వెంకట్‌. పెద్ద కొడుకు లక్ష్మణ్‌ తాగుబోతు. చిన్నకొడుకు వెంకట్‌ (అనిరుధ్) కంపెనీలో జాబ్‌ చేస్తుంటాడు. కొంచెం కొంచెంగా డబ్బు కూడబెట్టి ఇంటిని పోషిస్తూనే.. తన లవర్ స్వాతి (యశస్విని) బర్త్‌డేకి గిఫ్ట్‌ ఇచ్చే ప్లాన్‌లో ఉంటాడు. అది కాస్తా లక్ష్మణ్ కంట పడుతుంది. తాగుడు కోసం వెంకట్‌ డబ్బులు కాజేస్తాడు. అది తెలిసిన వెంకట్‌.. అన్న లక్ష్మణ్‌తో గొడవ పడతాడు. మాటా మాటా పెరిగి పోట్లాటకు దారితీస్తుంది. ఈ కొట్లాటలో లక్ష్మణ్‌కు వెంకట్‌ కొట్టిన దెబ్బ బలంగా తగిలి చనిపోతాడు. వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. లాయర్‌ రాజీవ్‌ కనకాల సాయంతో బెయిల్‌‌పై బయటపడతాడు. తండ్రి ఇంట్లోనుంచి వెళ్లగొడతాడు. అక్కడి నుంచి తన అన్న మరణానికి తాను కొట్టిన దెబ్బలు కారణం కాదని.. ఇంకేదో ఉందని వెతికే ప్రయత్నం చేస్తాడు. వెంకట్‌ తన అన్న చావుకు అసలు కారణం తెలుసుకున్నాడా..? అసలు మిస్టరీ ఏంటనేది తెలియాలంటే బిగ్‌స్క్రీన్‌‌పై ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

ప్రధాన పాత్రలో అనిరుధ్ తన పాత్రను సమర్థంగా పోషించారు. ఎమోషన్స్ ను బాగా పండించి పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్ గా యశస్విని కూడా పాత్రకు సరిపోయింది. తండ్రి పాత్రలో జీవా అనుభవాన్ని వాడుకుని చక్కగా సరిపోయారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకత్వ ప్రతిభ, స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌, ఆర్టిస్ట్‌ల అభినయం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మర్డర్‌ మిస్టరీలకు ప్రధాన బలం. ఈ సినిమాకు ప్రతి టెక్నీషియన్ తమ సపోర్ట్‌ని అందించారు. బి జీ ఎమ్, సినిమాటోగ్రఫీ మూడ్ కి తగ్గట్టుగా ఉండి సినిమాని ఎలివెట్ చేశాయి.

విశ్లేషణ :

ఈ సినిమాలో మర్డర్‌ మిస్టరీ‌ని ఛేదించడంతో పాటు ఎంటర్‌టైన్‌‌మెంట్, అలాగే మిస్టరీతో పాటు ఓ మెసేజ్‌ను కూడా జోడించిన విధానం బాగుంది. కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినా.. ఇప్పుడున్న ప్రేక్షకులకి కథనంతో పాటు కొత్తదనం కూడా కావాలి. అలాగే సినిమాటిక్‌ లిబర్టీని కూడా కథకి అనుగుణంగా వాడుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి మిస్టరీ థ్రిల్లర్స్ ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తాయి. ఆడియెన్స్‌ని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి.

యాద్గిరి అండ్ సన్స్‌ విషయంలో బడ్జెట్‌ పరిధి పరిమితమని తెలిసిపోతూనే ఉంటుంది. అయినా తన పరిధిలో మర్డర్‌ మిస్టరీని చివరి వరకు ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకోసం మర్డర్‌ జరిగిందనేది తెలిస్తే.. డబ్బు కోసం మనుషుల్లో ఇంత కసాయితనం పెరిగిందా? అని అనిపిస్తుంది.  మర్డర్‌ ఎందుకు జరిగిందనేది తెలిసి.. చూస్తున్న ప్రేక్షకులు సైతం షాకయ్యేలా చేయడంలో దర్శకుడు తన ప్రతిభను కనబరిచాడు. ఇలాంటివి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి కాబట్టి.. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ సినిమాని చూడాల్సిన ఆవశ్యకత అయితే ఉందని చెప్పుకోవాలి. లాజిక్‌లు పక్కన పెడితే.. మంచి మెసేజ్ మాత్రం ఇందులో ఉంది.

రేటింగ్: 3/5

చివరగా: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మెసేజ్ మిక్స్ చేసిన  మర్డర్ మిస్టరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here