హీట్ మూవీ రివ్యూ

0
779

వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి కాంబోలో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన చిత్రం హీట్. ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ ఉన్న తరుణంలో ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథ, కథనాలు ఏంటన్నది ఓ సారి చూద్దాం. సస్పెన్స్ థ్రిల్లర్‌ జానర్‌లకు ఉండే అభిమానులు హీట్ మూవీని ఏ మేరకు మెప్పించింది అనేది ఓ సారి చూద్దాం.

కథ :

అభి (వర్దన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి)లు మంచి స్నేహితులు. సొంతంగా కంపెనీని నడుపుతూ ఉంటారు. వారికి ఒక మలేషియన్ ప్రాజెక్ట్‌ విషయంలో స్టీఫెన్ అనే వ్యక్తితో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే క్రమంలో సిరిల్ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి) ను చర్చిలో పెళ్లి చేసుకుంటాడు. మతాంతర వివాహాం కావడంతో ఆరాధ్య అన్న రుద్ర రగిలిపోతోంటాడు. వారిని చంపేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే సిరిల్, ఆరాధ్యలు కనిపించకుండాపోతారు. దీంతో అభి చేసిన తన స్నేహితుల కోసం చేసిన ప్రయత్నాలేంటి? అభికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఈ మైఖెల్ అనే వ్యక్తి ఎవరు? అతని వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.

నటీనటుల పనితీరు :

అభి, సిరిల్, మైఖెల్, ఆరా ఇలా నాలుగు పాత్రల చుట్టే హీట్ కథ తిరుగుతుంది. ఇందులో అభి పాత్ర పోషించిన వర్ధన్ గుర్రాల సినిమా అంతా పరుగులు పెడుతూనే ఉంటాడు. స్నేహితుడ్ని కాపాడుకునే ప్రయత్నంలో వర్ధన్ కనబరిచిన నటన ఆకట్టుకుంటుంది. ఇంటరెస్ట్ ను మెయింటైన్ చేస్తూనే ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించే నటన కనబరిచాడు. మోహన్ సాయి, సిరిల్ పాత్రలో కథకి అనుగుణంగా ఆ పాత్రకు సరిపోయాడు. హీరోయిన్లైన స్నేహా ఖుషి, అంబికా వాణిలు ఆకట్టుకుంటారు. ఇక మైఖెల్‌గా సైకో, శాడిస్ట్  పాత్రలో వంశీ రాజ్‌ పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

సైకో కిల్లర్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమాలు కథ, కథనాల పరంగా ఒక టెంప్లేట్ లో సాగుతుంటాయి. కానీ వాటిని ఎంత టైట్ స్క్రీన్ప్లే తో నడిపారు అన్న దానిమీద ఆ చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకులు ఎమ్ ఎన్ అర్జున్, శరత్ వర్మ లు సక్సెస్ అయ్యారు. గౌతమ్ రవిరామ్ అందించిన ఆర్ఆర్ సీన్లను ఎలివేట్ చేసెలా సాగింది. ఈ సినిమా అంతా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. నైట్ విజువల్స్‌ను కెమెరామెన్ రోహిత్ బచు ఎఫెక్టివ్ గా తెరకెక్కించారు. ఎమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ సినిమా స్పీడ్ గా ఉండేలా ఉంది. ఎమ్ ఆర్ వర్మ, సంజోష్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లు ఎప్పుడూ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు ఇష్టమే. అయితే ఇలాంటి కథల్లో ఓ సైకో శాడిస్ట్ కారెక్టర్ ఉంటుంది.. హీరో హీరోయిన్లకు అతడి వల్ల సమస్యలు వస్తాయి.. అయితే సైకో కారెక్టర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే విధానం, సైకో పాత్రకు ఉండే ఫ్లాష్ బ్యాక్ ఇలా అన్నీ కూడా కామన్‌ ఉండే పాయింట్. కానీ వాటిలో కథ, కథనం ఏమైనా కొత్తగా ఉంటుందా? అని జనాలు ఆసక్తిగా చూస్తుంటారు. హీట్ సినిమా కథ, కథపరంగా ఎక్కువగా కొత్తదనం కనిపించకపోయినా, స్క్రీన్ ప్లే, సీన్లు పరిగెత్తినట్టుగా ఉండటంతో బోర్ ఫీలింగ్ రాకుండా ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేయగలిగింది. అలా కథనాన్ని పరిగెత్తించడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు.

ప్రథమార్థం మొత్తం సస్పెన్స్‌గా సాగుతుంది.. మర్డర్లు ఎందుకు జరుగుతున్నాయ్.. అవి చేసింది ఎవరు? హీరోని ఎందుకు ఇరికిస్తున్నారు వంటి ప్రశ్నలు తలెత్తి ప్రేక్షకుల్ని సినిమాలో నిమగ్నమయ్యేలా చేయడంలో దర్శకులు సఫలమయ్యారు. ద్వితీయార్థంలో సినిమా కాస్త నెమ్మదించినట్టు అనిపించినా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టు ఆకట్టుకుంటుంది. మొత్తంగా మంచి థ్రిల్లర్ ను ఎక్స్పెక్ట్ చేసి వెళ్లిన ప్రేక్షకులను మెప్పించేలా హీట్ చిత్రం సాగుతుంది.

రేటింగ్ : 3.25 / 5

చివరగా : రేసీ హీట్ కథ, కథనాలతో ఉత్కంఠ రేపెలా  ‘ హీట్ ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here