బిచ్చగాడుతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. తెలుగులోనూ ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు-2 తో వస్తున్నాడు విజయ్. బిచ్చగాడు -2 నుంచి ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.
‘చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను.. చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టూ మచ్చై ఉంటా తోడూ’ అంటూ సాగే ఈ గీతాన్ని భాష్య శ్రీ రాయగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సంగీతం విజయ్ ఆంటోనీ అందించాడు. అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో సాగే గీతంలా కనిపిస్తోంది. ‘బ్రతుకులే వీధిపాలైనా.. నిన్ను రథములో తిప్పుకోనా.. భూమి బద్దలైపోయి రెండు ముక్కలైపోయినా.. ఊయలల్లే నేను మారి నిన్ను మోయనా.. ’ఆర్ద్రతతో నిండిన సాహిత్యంతో వినగానే హృదయం బరువెక్కేలా ఉందీ పాట. బిచ్చగాడు2 లో ఇదే హైలెట్ సాంగ్ లానూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ కదిలించేలా పూర్తి ఎమోషనల్ టచ్ తో ఉంది. విజయ్ ట్యూన్ ను అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు అనురాగ్ కులకర్ణి.
ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలుండటంతో ఈ సమ్మర్ కు మంచి రిజల్ట్ అందుకుంటుంది అంటున్నారు.
విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో హీరోగానే కాక ఎడిటింగ్, మ్యూజిక్ ను కూడా అందిస్తున్నాడు. అలాగే తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్ లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనే. విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
ఇటీవలే 6వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ‘బిచ్చగాడు’ తమిళంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో 144 రోజుల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ అతి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
Get ready to be swept off your feet with the latest single #ChelliVinave from the highly anticipated movie #Bichagadu2
⏩https://t.co/C1R0IyHWbKSung by @anuragkulkarni_
Lyrics by #Bhashyasree
A @vijayantony Musical @saregamasouth @StarMaa @DisneyPlusHSTel @GskMedia_PR pic.twitter.com/HNurzCPkbp— Shiva Kumar B (@ShivaKumarB22) April 12, 2023