మహీ మీడియా వర్క్స్ బ్యానర్లో, మహేశ్వరి .కె నిర్మాతగా, ‘కవచం’ మూవీ డైరెక్టర్ ‘శ్రీనివాస్ ప్రభన్’ దర్శకత్వంలో వస్తున్న మరో ఇంట్రస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘అరంగేట్రం’. మే 5 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను మాస్ డైరెక్టర్ వి. వి . వినాయక్ చేతులు మీదుగా రిలీజ్ చేసారు.
సినిమా ట్రైలర్ చూసిన వినాయక్,
అరంగేట్రం చిత్ర దర్శకుడ్ని మెచ్చుకుంటూ ..ఇటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అన్నారు. అంతేకాకుండా ట్రైలర్ చాలా బాగుంది .. సినిమాకి సంబదించిన బడ్జెట్ విషయాలను అడగటం తో పాటు విజువల్స్ బాగున్నాయి, సినిమా సక్సెస్ అవ్వాలని ఆశ్వీరదించారు.
నాట్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో, ఆరుగురు కొత్త అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు దర్శకుడు ‘శ్రీనివాస్ ప్రభన్’ . ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అన్ని థియేటర్స్లో, యూట్యూబ్ లో ప్లే అవుతుంది. ఆడియన్స్ నుండి ట్రైలర్ కు మంచి ఆదరణ రావడంతో, చిత్ర యూనిట్ ఖుఫీ గా ఉన్నారు.
Here's the thrilling and intense #Arangetram Trailer 🔥🔥
~ https://t.co/YFe0hR1dlR#ArangetramMovie Releasing On May 5th 2023 💥#SrinivaasPrabhan #MusthafaAsgari #Pooja #MaheswariK #MahiMediaWorks #YbrantMedia pic.twitter.com/g1Z2dxBxfp
— BA Raju's Team (@baraju_SuperHit) April 10, 2023
రోషన్, శ్రీనివాస్ ప్రభన్, ముస్తఫా , అనిరుధ్, పూజ, లయ, కీర్తన, ఇందు, సాయిశ్రీ , విజయ, శ్రీవల్లి, జబరదస్త్ ఫేం సత్తిపండు కీలకపాత్రలు పోషించారు.
కథ- స్ర్రీన్ ప్లే- దర్శకత్వం – శ్రీనివాస్ ప్రభన్
నిర్మాత -మహేశ్వరి .కె
సంగీతం – గిడియన్ కట్టా
సినిమాటోగ్రఫీ- బురాన్ షేక్ ( సలీం)
కో – ప్రోడ్యూసర్- ఎం జి బి విజయలక్ష్మి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్- పోలూరి బ్రదర్స్
ప్రోడక్షన్ డిజైనర్, కో-డైరెక్టర్- రమేష్ బాబు చిన్నం (గోపి)
పిఆర్ఓ- Friday Poster నాగేశ్వారరావు




