బేబీ సాంగ్ పై నాటి, నేటి, మేటి సంగీత దర్శకుల ప్రశంసల జల్లు

0
143

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’.ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ రిలికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే మరో బ్యూటిఫుల్ సాంగ్ అనిపించుకుంది. విడుదలైన వెంటనే ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ పాటను మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ చేత పాడించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అభినందించడానికి టాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులు, సింగెర్స్ వచ్చారు. ఎఫ్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నాటి, నేటి సంగీత దర్శకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్బంగా ఈ పాటను పాడిన ఆర్య దయాళ్ మాట్లాడుతూ.. ” ఈ పాటను రికార్డింగ్ చేస్తున్నప్పుడు చాల ఛాలెంజిన్గ్ గా ఉంది. పాటలో చాల స్వరాలూ ఉన్నాయి. ఎక్కువగా ప్రిపేర్ కాకుండానే పాడాల్సి వచ్చింది. రికార్డింగ్ టైమ్ లో స్టూడియో కేవలం పదిమంది మాత్రమే ఉన్నారు. వాళ్లంతా నన్ను బాగా ఎంకరేజ్ చేసారు. ఈ జర్నీ పార్ట్ అయినా ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నాను.. ” అన్నారు. అనంతరం వేదిక పై మరోసారి ఈ గీతాన్ని లైవ్ లో ఆలపించింది ఆర్య దయాల్.
*ఈ సందర్బంగా ఈ లైవ్ కార్యక్రమానికి హాజరైన సీనియర్ సంగీత దర్శకులు రాజ్, కోటి, ఆర్.పి పట్నాయక్, ఏం ఏం శ్రీలేఖ, భీమ్స్,మార్క్ కే రాబిన్, ప్రశాంత్ ఆర్ విహారి,చైతన్ భరద్వాజ్, కమ్రాన్, తో పాటు పలువురు సంగీత దర్శకులు మాట్లాడుతూ ..* ” స్వరకర్త విజయ్ అద్భుతమైన కంపోసింగ్ చేసాడు. ఫస్ట్ సాంగ్ కంటే కూడా బావుంది. సింగర్ ఆర్య దయాల్ తెలుగు అమ్మాయి కాకపోయినా గొప్ప కమాండింగ్ గా పాడింది. తనకు తెలుగులో మంచి భవిష్యత్ ఉండబోతోంది. కంపోసింగ్ రేర్ గా ఉంది. విజయ్ స్వర రచన లో ఒక లైఫ్ ఉంటుంది.. అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.. “.
*దర్శకుడు మారుతీ మాట్లాడుతూ* ” ఈ కార్యక్రమానికి రాజ్ కోటి గార్లు రావడం హ్యాపీగా ఉంది. ఆ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ చూద్దాం అదృష్టం అనుకుంటున్నా. ఒక చిన్న సినిమాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి మా మాస్ మూవీస్ బ్యానర్ తరపు నుంచి థాంక్స్ చెబుతున్నాను. ఈ పాట ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. ” అన్నారు.
*చిత్ర దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ* .. ” ఈ పాట ట్యూన్ కూడా కట్టక ముందే ఈ పాటను ఆర్య దయాల్ తోనే పాడించాలని అనుకున్నాం. ఈ పాట తనకోసమే పుట్టింది. ఆమె తోలి తెలుగు పాటను నా సినిమాలో పాడించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తిగారు చాల గొప్పగా రాసారు. అద్భుతమైన పద ప్రయోగాలు చేసారు.
*గీత రచయిత కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ..* ” ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. చిన్నప్పటి నుంచి మీ ఇన్స్పిరేషన్ తోనే పరిశ్రమలోకి వచ్చాం. ఏ గేయ రచయితా అయినా దర్శకుడి సంస్కారాన్ని బట్టే సాహిత్య ఉంటుంది. ఈ పాటను కృష్ణ చైతన్య గారు రాయాలి. కానీ ఆయన నా పేరు సజెస్ట్ చేసారు. ఈ సందర్బంగా కృష్ణ చైతన్య సంస్కారానికి ధన్యవాదాలు చెబుతున్నాను.. ” అన్నారు.
*సంగీత దర్శకుడు విజయ్ మాట్లాడుతూ ..* ” ఇంతమంది సంగీత దర్శకులు రావడం చాల సంతోషంగా ఉంది. ఇంత ప్రమోషన్ చేస్తున్నందుకు దర్శక, నిర్మాతకు ధన్యవాదాలు. ఈ పాటను గొప్పగా పాడిన ఆర్య దయాల్ కు థాంక్స్.. ” అన్నారు.
*హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ* .. ” ఇక్కడ చాల టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఒక కాలికేటెడ్ సీన్ చేస్తున్నప్పుడు ఒక ట్యూన్ పంపించారు. ఆ ట్యూన్ విన్న వెంటనే సీన్ చాల ఈజీ అయిపొయింది. ప్రతి విషయాన్నీ దర్శకుడు సాయి రాజేష్ మాతో పంచుకుంటారు. ఈ సందర్బంగా అందరికీ థాంక్స్ చెబుతున్నాను .. ” అన్నారు.
*హీరోయిన్ వైష్ణవి చైతన్య* మాట్లాడుతూ ” ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థాంక్స్. మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సీన్ మూడ్ లోకి వెళ్లాలంటే సాయి గారు ఒక ట్యూన్ ఇచ్చేవారు. సాడ్ సీన్ అయినా జాలీ సీన్ అయినా అది మాకు బాగా హెల్ప్ అయ్యేది.. ” అన్నారు.
*మరో హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ* .. “ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన అందరికీ థాంక్స్ చెబుతున్నాను. ఈ పాట మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ పాట అందరి ఫేవరెట్ ప్లే లిస్ట్ లో ఫస్ట్ లు ఉంటుంది. మా దర్శకుకు సాయి రాజేష్ గారి తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్లే సాధ్యం అయిందనుకుంటున్నాను.. ” అన్నారు.
*నిర్మాత ఎస్.కే.ఎన్ మాట్లాడుతూ* .. ” నా చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అయినా రాజ్ కోటి గారిని ఒకే ఫ్రేమ్ లో
అదీ నా ఫంక్షన్ లో చూడటం అదృష్టాంగా భావిస్తున్నాను. ఒక జెనరేషన్ నుంచి మరో జెనరేషన్ కి డిఫరెన్స్ తెలిపేది సంగీతం సాహిత్యమే. ఆ సంస్కృతికి వారథులైన మీ అందరినీ సారథులుగా భావిస్తున్నాను. కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ పాటను సాయి రాజేష్ టేస్ట్ కు తగ్గట్టుగా అద్భుతంగా రాసారు. ఓ మలయాళ సింగర్ ఇంత గొప్పగా పాడటం హ్యాపీగా ఉంది. ఈ పాట ఇప్పుడు ప్రమోషన్ కోసం కాదు.. ఇది మా ఎమోషన్..” అన్నారు.
హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ఇది..

ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు.

టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః ఏలూరు శీను, జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here