ఓ సాథియా మూవీ నుంచి యూత్‌ఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్

0
129

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఓ సాథియా అనే మూవీ రూపొందుతోంది. ప్రేమకథలో కూడా ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ‘ఓ సాథియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. చిత్రంలో ఆర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

జీ జాంబి సినిమాతో హీరోగా పరిచయమైన ఆర్యాన్ గౌర.. తన రెండో ప్రయత్నంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన సరసన మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసి తాజాగా ఈ మూవీ ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.

నేల మీద లేనే ఆ మాట నువ్వు చెప్పగానే.. అంటూ సాగిపోతున్న ఈ మెలోడియస్ సాంగ్ యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉంది. ప్రేయసిపై ఘాడంగా ప్రేమిస్తున్న ప్రేమికుడి ఫీలింగ్స్ అన్నీ ఈ పాటలో కనిపిస్తున్నాయి. సాంగ్ టేకింగ్, పాటకు తగిన విజువల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ పై వినోద్ కుమార్ (విన్ను) కట్టిన బాణీలు ఈ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. హీరోహీరోయిన్లపై ఎంతో నాచురల్‌గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఈ సాంగ్ లెవెల్ పెంచేశాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చెప్పాలనే ఈ పాటతో యూత్ కన్ను ఒక్కసారిగా ఓ సాథియా మూవీపై పడింది.

ఇప్పటికే ఓ సాథియా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షక ఆదరణ పొందగా.. ఇప్పుడు వదిలిన సాంగ్ అంచనాలు నెలకొల్పింది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

http://shorturl.at/qwOUW

సాంకేతిక బృందం
దర్శకత్వం : దివ్య భావన
నిర్మాత : చందన కట్టా
లైన్ ప్రొడ్యూసర్: వంశీ కృష్ణ జూలూరు
ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్స్: చంద్ర తివారీ ఆవుల, కేశవ్ సాయి కృష్ణ గౌడ్
బ్యానర్ : తన్విక జశ్విక క్రియేషన్స్
సంగీత దర్శకుడు : విన్ను
పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్
ఎడిటర్ : కార్తిక్ కట్స్
కెమెరామెన్ : ఈజే వేణు
పీఆర్వో : సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here