నైట్రో స్టార్ సుధీర్ బాబు, హర్షవర్ధన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మామా మశ్చీంద్ర డీజే లుక్ విడుదల

0
129

నైట్రో స్టార్ సుధీర్ బాబు వరుస సర్ప్రైజ్‌లతో వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన, నటుడు-దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన మామా మశ్చీంద్ర లో సుధీర్ బాబు  మూడు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారు.

ఊబకాయం ఉన్న దుర్గ, ఓల్డ్ డాన్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. డిజె క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా మూడవ సర్ ప్రైజ్ తో వచ్చారు. టీ-షర్ట్,  రిప్డ్ జీన్స్ ధరించి, హెడ్‌సెట్‌తో పూర్తిగా పారవశ్యంలో కనిపిస్తున్నారు. మొదటి రెండు గెటప్‌లలో డీ-గ్లామ్ లుక్స్‌లో కనిపించగా, మూడో లుక్‌లో డీజేగా తన రిథమ్‌తో మనసుల్ని దోచుకునేలా కనిపించాడు.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్,  సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు నటించారు, అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తోంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, పిజి విందా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: సుధీర్ బాబు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here