సి కళ్యాణ్…… మా సభ్యులలో కె సురేష్ బాబు ని మూడు సంవత్సరాలు, యలమంచిలి రవిచంద్ ను జీవిత కాలం బహిష్కరిస్తున్నాం

0
292

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రెస్ మీట్…….ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్…

నిర్మాతల మండలి అధ్యక్షులు సి కళ్యాణ్ మాట్లాడుతూ:
నిర్మాతల మండలి కి గొప్ప చరిత్ర ఉంది అది ఎప్పుడు బాగుండాలి అని మా కోరిక
TFPC కమిటీ పై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు.అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం.ఆర్గనైజేషన్ కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోము.ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది ఎదో రాద్ధాంతం చేస్తున్నారు.
మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. మా కౌన్సిల్ లో ప్రస్తుతం 9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం… దాసరి నారాయణ రావు గారే.
1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 19 కు…సాయంత్రం కౌంటింగ్ అదే రోజు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది.

మా సభ్యులలో కె సురేష్ బాబు ని మూడు సంవత్సరాలు, యలమంచిలి రవిచంద్ ను జీవిత కాలం బహిష్కరిస్తున్నాం…

ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్ …దానికి అనుబంధగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఉన్నాయి…అంతే తప్ప ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థల కు మాకు సంబంధం లేదు. పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవి కూడా tfpc .tfcc.sifcc.FFI లో భాగం కాదు

నంది అవార్డులు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల ను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆంధ్రలో నంది అవార్డులు, తెలంగాణ లొ సింహ అవార్డులు త్వరగా ఇవ్వాలి. లేకపోతే మా ఫిలిం ఇండస్ట్రీ తరుపున అవార్డులను మేమె ఇస్తాము. అని అన్నారు…
ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, వై వి యెస్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here