నేనెవరు మూవీ రివ్యూ

0
709

సినిమా: నేనెవరు

విడుదల తేదీ: 02/12/2022

రన్ టైం : 2 గంల 2 ని లు

నటీనటులు : కోలా బాలకృష్ణ, సాక్షి చౌదరి, తనిష్క్ రాజన్, కాలకేయ ప్రభాకర్, రాజా రవీంద్ర, గీత్ షా

సంగీతం: ఆర్ జీ సారథి

ఎడిటర్: కోలా భాస్కర్

డి వో పి: సమల భాస్కర్

నిర్మాతలు: భీమనేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు

రచన, దర్శకత్వం : నిర్ణయ్ పల్నాటి

కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్, తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నేనెవరు”. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో తెరకెక్కింది. లవ్… సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు (డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ఇందులో కోలా బాలకృష్ణ హీరోగా నటించారు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్,
రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం!!

కథ :

క్రిష్ (కోలా బాలకృష్ణ), చిత్ర (గీత్ షా) ప్రేమికులు. ఒక చిన్న గొడవ వారిద్దరినీ వేరు చేస్తుంది. ఈ సంఘటనతో క్రిష్ బాగా డిప్రెస్ అయిపోతాడు. అయితే మరోపక్క తన మేనత్త, మేనత్త కూతురు (తనిష్క్ రాజన్)… జీకే (బాహుబలి ప్రభాకర్), తన మేనత్త అనుచరుడు నాయుడు వరుసగా హత్యలకు గురవుతారు. ఇవేవీ పట్టించుకోని క్రిష్ తన ప్రేయసిని తలచుకుంటూ, తాగుడుకు బానిసై అందరితో గొడవ పడుతూ వుంటాడు. క్రిష్ చిత్ర కలిసారా? ఆ వరుస హత్యలకు కారణం ఎవరు? అనేది తెలియాలంటే నేనెవరు చూడాల్సిందే!!

నటీనటుల పనితీరు:

క్రిష్ గా కోలా బాలకృష్ణ భగ్న ప్రేమకుడిగా, రివెంజ్ డ్రామా లో మాస్ ను మెప్పించే పాత్రలో చక్కని నటన కనబరిచాడు. అతనికి జంటగా ప్రేయసి పాత్రలో గీత్ షా చక్కగా చేసింది. హీరోను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే యువతిగా కాస్త సైకోలా బిహేవ్ చేసే పాత్రలో ఆకట్టుకుంటుంది. హీరో మరదలిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. ఆమె అమ్మగా లేడి దాధాగా నటించిన నటి కూడా మంచి నటన కనబరిచింది. ఇక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాక్షి చౌదరి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్పెషల్ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా చెలరేగి నటించింది. బాహుబలి ప్రభాకర్ జి.కె.పాత్రలో విలన్ గా. హీరో స్నేహితునిగా కమెడీయన్ సుదర్శన్ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు నిర్ణయ్ పల్నాటి రాసుకున్న కథ, కథనాలు ఎక్కడా స్లో అనిపించకుండా చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. ప్రేక్షకుల్ని కట్టిపడేసే లవ్, సస్పెన్స్  క్రైం ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఉత్కంఠ రేపే థ్రిల్లర్ మూవీని దర్శకుడు నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించాడు. ఆర్.జి.సారథి అందించిన సంగీతం సీన్స్ ను ఎలివేట్ చేశాయి. ఓ రెండు ట్యూన్స్ చాలా రోజులు మనలను వెంటాడతాయి. ముఖ్యంగ క్రైం థ్రిల్లర్స్ కి కావలసిన నేపథ్య సంగీతం బాగా బాగుంది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉంది. విజువల్స్ క్వాలిటీ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు లావీష్ గా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించిన నిర్మాతలు అభినందనీయులు. కోలా భాస్కర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి పెద్ద బలం.

విశ్లేషణ:

ప్రేమతో ముడిపడిన క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ కి ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుంది.  అందుకే అలాంటి కథలని ఎన్ని కోణాల్లో ఆవిష్కరించినా కొత్తగానే ఉంటుంది.  ఫస్ట్ హాఫ్ లో హీరోని భగ్న ప్రేమికడిగా, తాగుబోతుగా చూపించి… ఆ తరువాత… మర్డర్ మిస్టరీని ఛేదించిన విధానం ప్రేక్షకుల్ని థ్రిల్ కి గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ క్రైం అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను కట్టి పడేస్థాయి. దర్శకుడు రొటీన్ జోనర్స్ ని టచ్ చేయకుండా… ఓ డిఫరెంట్ జోనర్లో ఈ మూవీని తెరకెక్కించడంలో విజయం సాధించారు.

రేటింగ్: 3/5

చివరగా: ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ విత్ లవ్ స్టొరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here