విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది. ఇది అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా : ‘దాస్ కా ధమ్కీ’ తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ

0
218

యంగ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ అందించారు. నిన్న తన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో ఇంటెన్స్ అవతార్లో కనిపించాడు. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. విశ్వక్ సేన్ 10 వేలకోట్ల టర్నోవర్ గల ఇండస్ట్రీ ధనికుడిగా, వెయిటర్ గా ద్విపాత్రాభినయంలో కనిపించారు. ధనికుడి మరణం తరువాత, అతని కంపెనీ, కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వెయిటరైన విశ్వక్ ని..  కంపెనీ, కుటుంబం బాధ్యత తీసుకోవాలని రావు రమేష్ కోరుతాడు. ధనవంతుడు నిజంగా చనిపోయాడా? కంపెనీని, విశ్వక్ కుటుంబాన్ని కుప్పకూల్చేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? అనేది ఆసక్తికరంగా వుంది.

కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్ అన్ని కమర్షియల్ హంగులను జోడించి పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఇందులో హ్యుమర్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్స్, ఎమోషన్స్ , డ్రామా ఉన్నాయి. ట్రైలర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.

నివేదా పేతురాజ్ ప్రేమను గెలుచుకోవడానికి తన ఒరిజినల్ ఐడెంటీటీ  వెయిటర్ గా విశ్వక్ సేన్ ఫెర్ఫార్ మెన్స్ హిలేరియస్ గా వుంది. రిచ్ గా చాలా ఇంటెన్స్గా కనిపించారు. ఈ రెండు పాత్రల మధ్య చాలా వేరియేషన్ చూపించాడు.

నివేదా పేతురాజ్ గ్లామర్ గా కనిపించింది. హైపర్ ఆది,  రంగస్థలం మహేష్ లకు విశ్వక్ స్నేహితులుగా ఆకట్టుకొని ఇద్దరూ కామిక్ రిలీఫ్ ను అందించారు. రావు రమేష్, రోహిణి ఇతర ముఖ్య తారాగణం.

ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన డైలాగ్స్ హ్యుమర్,  పవర్ ఫుల్ గా ఉన్నాయి. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం  నిర్మాణ విలువలు గ్రాండ్ గా,  విజువల్స్ క్రిస్ప్గా ఉన్నాయి. దినేష్ కె బాబు కెమెరా వర్క్ అద్భుతంగా వుంది.  లియోన్ జేమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ చాలా అద్భుతంగా కన్నుల విందుగా వుంది. విశ్వక్ సేన్ కి నా అభినందనలు. డీవోపీ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. యష్ మాస్టర్ అద్భుతమైన స్టెప్స్ వేయించారు. మంచి సాహిత్యం కూడా వుంది. సినిమా అంటే విశ్వక్ కి చాలా ప్యాషన్. ఈ సినిమా చూస్తే విశ్వక్ ప్యాషన్ ఏంటో తెలుస్తుంది. ఎన్నో ఒడిదుడుగులు దాటి ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని కొత్తదనంని ఎప్పుడూ ఆదరిస్తారు. ఫలక్ నామా దాస్, అశోకవనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా ఇలా వైవిధ్యమైన సినిమాలతో అలరించి ఇప్పుడు దాస్ కా ధమ్కి తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్. ఈ సినిమాకి నటనతో పాటు దర్శకత్వం నిర్మాణం చేయడం కూడా చాలా అరుదైన విషయం. అన్నీ తానై, తన టీంకి స్ఫూర్తిని ఇచ్చారు విశ్వక్ సేన్. ఇలాంటి సినిమాలు చూస్తున్నపుడు నన్ను నేను ఊహించుకుంటాను.  ‘దాస్ కా ధమ్కీ’ థియేటర్ లో చూడాల్సిన సినిమా.  దర్శకుడిగా అద్భుతంగా తీశారు విశ్వక్. టీం అందరికీ నా అభినందనలు. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సినిమా వందరోజుల వేడుకకి కూడా నేను రావాలి” అని కోరుకున్నారు

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. బాలయ్య గారు ఎంత పవర్ ఫుల్లో అంత స్వీట్. కాల్ చేస్తే హాయ్ బ్రో అని ఎంతో ప్రేమగా పలకరిస్తారు. బాలయ్య గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు.  దాస్ కా ధమ్కిని ఎక్కడా రాజీపడకుండా ఏడాది మొత్తం ఇదే సినిమాపై కష్టపడుతూ ఎంతో ప్యాషన్ చేసిన సినిమా ఇది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి” అని కోరారు.

నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ .. నేను ఎన్టీఆర్ గారిని అభిమానిని. బాలకృష్ణ గారు దాస్ కా ధమ్కి ట్రైలర్ రిలీజ్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకి కృతజ్ఞతలు. మేము తీసిన మొదటి సినిమా ఫలక్ నామా దాస్ ని ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారు. మా అబ్బాయి మాస్ ఇమేజ్ తెచ్చింది. ఇప్పుడు దాస్ కా ధమ్కి నిర్మించాం.  ఈ ఒక్క సినిమాకి నాలుగు సినిమాల కష్టం పడ్డాడు. ఆ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమాని పెద్ద విజయాన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో ఎడిటర్ అన్వర్, యష్ మాస్టర్, పూర్ణచారి,  ప్రసన్న కుమార్ బెజవాడ తదితరులు పాల్గొన్నారు.

ఎ.రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్ కాగా, అన్వర్ అలీ ఎడిటింగ్ పని చేస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

సాంకేతిక  విభాగం :
దర్శకత్వం: విశ్వక్ సేన్
నిర్మాత: కరాటే రాజు
బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్
కథ: ప్రసన్న కుమార్ బెజవాడ
డీవోపీ: దినేష్ కె బాబు
సంగీతం: లియోన్ జేమ్స్
ఎడిటర్: అన్వర్ అలీ
ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు
ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here