డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘అధర్వ’ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రిలీజ్

0
150

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘అధర్వ’. షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా భారీ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టిన చిత్రయూనిట్.. ఎప్పటికప్పుడు సరికొత్తగా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చిత్రంలో నిత్య అనే పాత్రలో సిమ్రాన్ చౌదరి కనిపించనుందని తెలిపిన యూనిట్.. ఈ రోల్ సినిమాలో చాలా కీలకం అని పేర్కొన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మిస్టరీ కేసును ఛేదించడంలో ఆధారాలు వెతుకుతున్నట్లుగా చాలా సీరియస్ లుక్ లో కనిపించింది సిమ్రాన్ చౌదరి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ పోస్టర్ విడుదల చేశారు.

రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేయించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీ నుంచి హీరోకి సంబంధించిన యాక్షన్ లుక్‌ని రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ను పోషించినట్టు ఆ లుక్ హింటిచ్చింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన సిమ్రాన్ చౌదరీ లుక్ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ పెంచేసింది.

ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని ఇప్పటివరకు వదిలిన అప్ డేట్స్ స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్. ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.

ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

టెక్నికల్ క్రూ:
రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి
ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి
బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
DOP: చరణ్ మాధవనేని
ఎడిటింగ్: SB ఉద్ధవ్
ఆర్ట్: రామ్ కుమార్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ
PRO: సాయి సతీష్, పర్వతనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here