అది లలిత శివజ్యోతి వారి
లవకుశ చిత్ర ప్రారంభోత్సవం.
ముహూర్తం తోలి షాట్ అన్న ఎన్టీఆర్ పై తీయాలని దర్శకులు పుల్లయ్య గారు అనుకున్నారు. ఆహుతులు, ఆ సినిమాలో నటించే నటీనటులు అందరు వచ్చారు. ఆ రోజు ముహూర్తం షాట్ మాత్రమే. తరువాత రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్. అందువల్ల వాళ్లకు మేకప్ ఏమి లేదు. ముహూర్త సమయం వచ్చింది, విజిల్ వినిపించింది. అంత నిశ్శబ్దం.
కెమెరా స్టార్ట్, ఏక్షన్ అంటూ ఖంగు మన్నది పుల్లయ్యగారి స్వరం. శ్రీరామచంద్రమూర్తి గా అన్న ఎన్టీఆర్ నడుస్తూ వచ్చాడు. కట్. అంత చప్పట్లు.
రేలంగి పరిగెత్తుకొచ్చి రామారావు ను కౌగలించుకున్నాడు, ఏమి వర్చస్సు, ఏమి వర్ఛస్సు బాబు. గుళ్లో దేవుడిని చూసిన అనుభూతి కలిగింది. నీవు సామాన్యుడవు కాదు. నీ చెయ్యి చూపించు అన్నాడు. హస్తసాముద్రికం తెలిసిన రేలంగి.
అందరు ఆసక్తిగా చూస్తున్నారు. నీవు మహార్జాతకుడివయ్యా బాబు. నీవు ఏది పట్టినా బంగారమే. శుభమే. తిరుగులేని నటుడవు అవుతావు. దైవాంశ కనిపిస్తుంది. పురాణ పురుషుల పాత్రలలో వెలిగిపోయి, పూజలు అందుకుంటావు. నీకు 50 సంవత్సరాలు నిండిన తరువాత అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితం ఊహించనంత ఎత్తు ఎదిగి, దేశమంతా నీ పేరు మారుమోగుతోంది. అప్పుడు నన్ను మరచిపోవద్దయా బాబు అన్నారు. తధాస్తు అన్నారట పుల్లయ్య, అంజలీదేవి.
అప్పటిదండి ఈ ఫోటో



