నితిన్, సుధాకర్ రెడ్డి, శ్రేష్ట్  మూవీస్ మాచర్ల నియోజకవర్గం నుండి అంజలి స్పెషల్ సాంగ్ ‘రారా రెడ్డి’ విడుదల

0
243

వర్సటైల్ స్టార్ నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ లోని స్పెషల్ సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది. మొదట ఈ పాటలోని అంజలి లుక్‌ని విడుదల చేశారు. తర్వాత అదిరిపోయే ప్రోమోని విడుదల చేశారు.  స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హైదరాబద్ లో గ్రాండ్ గా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో మాస్ డ్యాన్స్ నంబర్ ”రా రా రెడ్డి” లిరికల్ వీడియోను విడుదల చేశారు.

ప్రోమోలో కొన్ని అద్భుతమైన డ్యాన్స్‌లు కనిపించగా, లిరికల్ వీడియో మరింత అద్భుతంగా, మాస్ వీర లెవల్ లో వుంది. విన్నవెంటనే మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. నితిన్ ఎనర్జీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, అంజలి గ్లామర్ ఈ పాటని ఇన్స్టెంట్ హిట్ గా నిలిపాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ని మురిపిస్తుంది . ”రా రా రెడ్డి’  పాట మాస్ మ్యజికల్ సెన్సేషన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నితిన్, అంజలి మాస్ డ్యాన్స్ స్టెప్స్ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. నితిన్ తొలి చిత్రం ‘జయం’ లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో నితిన్, అంజలి, కృతి శెట్టి ”రానురాను’  బిట్ సాంగ్ కి వేదికపై డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ ఈవెంట్ లో నితిన్, రాజ శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, అంజలి, కృతి శెట్టి, దిల్ రాజు, మహాతి స్వరసాగర్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ.. అభిమానులు ఎప్పుడూ డ్యాన్స్ సాంగ్స్ చేయమని అడుగుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నెంబర్స్ పెట్టాం. లిరికల్ వీడియోలో వున్నది సాంపిల్ మాత్రమే ఈ సినిమాలో పాట అదిరిపోతుంది. జానీ మాస్టర్ తో చేసిన ప్రతి పాట సూపర్ హిట్, ఈ పాట కూడా సూపర్ హిట్ అయ్యింది. సాగర్ అద్భుతమైన ట్యూన్ చేశారు. కాసర్ల శ్యామ్ చాలా మాస్ గా రాశారు. దర్శకుడు రాజ శేఖర్ రెడ్డి సినిమా అద్భుతంగా తీశారు. దిల్ రాజు గారు ఈ పాటని రిలీజ్ చేయడం ఆనందం. ఈ పాటలో జయంలో రానురాను పాట రిపీట్ చేయడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ పాటని షూట్ చేస్తున్నపుడు ఇరవై ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీ వుండిదో అదే ఎనర్జీ తో ఈ పాటని చేశాను. నన్ను లాంచ్ చేసిన తేజ గారికి, ఆ పాటని ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అంజలి అద్భుతమైన నటి. ఈ పాట చేస్తున్నపుడు ఆమెకు మోకాలికి గాయం వున్నప్పటికీ ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ చాలా హార్డ్ వర్క్ చేసిన అద్భుతమైన డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కృతితో నా మొదటి సినిమా. ఈ సాంగ్ లో కూడా కృతి సర్ ప్రైజ్ వుంటుంది. ఆగస్ట్ 12 న సినిమా వస్తుంది.దానికి ముందు మరిన్ని ఈవెంట్స్ తో కలుద్దాం” అని చెప్పారు.

అంజలి మాట్లాడుతూ.. రారా రెడ్డి నాకు స్పెషల్ సాంగ్. నితిన్ గ్రేట్ డ్యాన్సర్. పక్కన డ్యాన్స్ చేయడం అంత తేలిక కాదు. పాట చివర్లో రానురాను అనే పల్లవి రావడం ఇంకా జోష్ ని నింపింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ పాటని, సినిమాని పెద్ద హిట్ చేయాలి” అని కోరుకున్నారు.

కృతిశెట్టి మాట్లాడుతూ.. నితిన్ గారు ఎక్స్ ప్రెసీవ్ డ్యాన్సర్. ఆయన డ్యాన్స్ చేసినప్పుడు బాడీతో పాటు పేస్ కూడా డ్యాన్స్ చేస్తుంది. ఇది ఒక నటుడికి ఉండాల్సిన గొప్ప క్యాలిటీ అది. ఇది నా ఫేవరట్ సాంగ్.  అంజలి గారు పాటలో అందంగా కనిపిస్తుంది. పాటలన్నీ బావున్నాయి. దర్శకుడు,నిర్మాతలకు థాంక్స్.” అన్నారు.

దర్శకుడు రాజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన  దిల్ రాజు గారి చేతులు మీదగా మా ఫస్ట్ ఈవెంట్ జరగడం ”మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని టీం అంతా నమ్మకంగా వున్నాం” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. జయంతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై ఏళ్ళు పుర్తయింది. ఇది మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ హీరోలు వున్నారు. ఇంత కాంపిటేషన్ లో సక్సెస్ ఫుల్ గా వుండటం గొప్ప విషయం. నితిన్ మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలి. అంజలి మంచి నటి. ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మిమ్మల్ని అలరిస్తుంది. కృతిశెట్టి తో పాటు మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం దర్శకుడిగా పరిచయం అవుతున్న రాజ శేఖర్  కు ఆల్ ది బెస్ట్. సాగర్, నితిన్ కి భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పాటలన్నీ అద్భుతంగా వున్నాయి. ఆగస్ట్ 12న విడుదలౌతున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చాలి” అని కోరుకున్నారు.

సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ.. నా కెరీర్ ఫస్ట్ టైం ఇంత పెద్ద మాస్ సాంగ్ చేశాను. నితిన్ అన్నతో నా మూడో సినిమా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

గేయ రచయిత కాసర్ల శ్యామ్  మాట్లాడుతూ..నితిన్  గారికి నేను రాసిన బొమ్మోలె వుందిరా పోరి, వాటే బ్యూటీ పాటలు మించి  ‘రారా రెడ్డి’ సూపర్ హిట్ అవుతుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు ధన్యవాదాలు. మాచర్ల నియోజికవర్గం చిత్రం మనం ఊహించిన దాని కంటే వందరెట్లు అద్భుతంగ వుంటుంది.

ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.

‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్

సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల

సంగీతం: మహతి స్వర సాగర్

డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : మామిడాల తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు

పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here