“హ్యాపీ బర్త్ డే” మూవీ నుంచి పార్టీ సాంగ్ విడుదల

0
223

లావణ్య త్రిపాఠీ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా “హ్యాపీ బర్త్ డే” సినిమా విడుదల కాబోతున్నది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి కంటెంట్, రివీల్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓన్లీ లీగల్ పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్ అంటూ జోష్ ఫుల్ పాటను విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్ కు కాళభైరవ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, దామినీ భాట్ల పాడారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు లావణ్య త్రిపాఠీ డాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ: vamshi shekar, మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here