పక్కా కమర్షియల్‌’ సినిమాలో కావాల్సినంత వినోదం గ్యారెంటీ – ప్రవీణ్‌

0
337

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా నాయిక. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత నవ్వులు ఉంటాయి అంటున్నారు కీలక పాత్రలో నటించిన ప్రవీణ్‌. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…

-దర్శకుడు మారుతి నన్ను కమెడియన్‌గా నిలబెట్టాడు. నా పేరుతోనే క్యారెక్టర్స్‌ రాసి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆయన చెప్పిన సీన్స్‌లో నటిస్తుంటే నవ్వుతుంటాడు. ఆ నవ్వే చాలా కాన్ఫిడెన్స్‌ తీసుకొస్తుంది. మనం బాగా నటిస్తున్నామని అనుకునేలా చేస్తుంది.

-ఈ చిత్రంలోనూ ప్రవీణ్‌ అనే పాత్రలో కనిపిస్తా. హీరో గోపీచంద్‌కు కోర్టులో ఫైల్స్‌ అందిస్తూ హెల్ప్‌ చేస్తుంటా. ‘వాంటెడ్‌’, ‘మొగుడు’ చిత్రాల తర్వాత ఆయనతో కలిసి నటించిన చిత్రమిదే.

-మారుతి చిత్రాల తరహా వినోదం ఇందులోనూ చూస్తారు. సినిమాలో కావాల్సినంత వినోదం గ్యారెంటీ అని చెప్పగలను.

-జబర్దస్త్‌ లాంటి కామెడీ షోస్‌ వల్ల ప్రతివారం ఇండస్ట్రీకి ఒక కొత్త కమెడియన్‌ వస్తున్నాడు. హాస్యనటుల్లో పోటీ బాగా పెరిగింది. ఇప్పటికి నాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. లేని రోజు ఏం చేయాలని ఆలోచిస్తా.

-కోట శ్రీనివాసరావులా విలన్‌, కమెడియన్‌ చేయొచ్చు. అయితే నేను విలన్‌గా నటించే అవకాశం రాలేదు.

-ప్రస్తుతం రవితేజతో ‘రావణాసుర’, ‘ధమాకా’, అల్లరి నరేష్‌ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను’ అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here