సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.పతా కంపై వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ప్రకాష్ నాగ్ మీడియాతో మాట్లాడుతూ..
మాది వైజాగ్ నేను అక్కడే పుట్టాను. మా ఫాదర్ ఆర్మీ లో ఉన్నందున నేను చాలా రాష్ట్రాలు తిరగవలసి వచ్చేది. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తరువాత ఫైవ్ స్టార్ హోటల్ లో జనరల్ మేనేజర్ గా వర్క్ చేశాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ హోటల్స్ లో వర్క్ చేయడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం నేను దుబాయ్ కి వెళ్లడం జరిగింది అక్కడ కొంతకాలం మల్టీ నేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. అయితే నా లైఫ్ స్టైల్ చాలా ట్రెండీగా ఉండేది. ఇక్కడ మ్యూచివల్ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు గోపి గారు పరిచయమయ్యారు.
గోపి గారికి నా వర్కింగ్ స్టైల్ నచ్చి మేము సోషల్ మెసేజ్ ఉన్న ఒక సినిమా తీస్తున్నాము ఈ సినిమాలో నెగిటివ్ రోల్ ఉంది,మిమ్మల్ని చూడగానే మా సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు.నేను తెలుగు వాడిని అయినందున నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం.అందుకే నాకు మొదటి చిత్రానికే ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక, నిర్మాతలు దొరకడం నా అదృష్టం. అందుకే వారికి నా ధన్యవాదములు
ఈ సినిమాలో సమాజంలో జరిగే చాలా విషయాలను చర్చించాం. ముఖ్యంగా మన వ్యవస్థలో భాగమైన ప్రభుత్వం.. ఎలా పని చేస్తుంది. అందులో లోపాలేంటి? అనే విషయాలను చూపించాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా ఇన్నోసెంట్ గా ఉంటుంది. నేను గాడ్సే వంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది .
నాకు గోపి గారు ఈ కథ చెప్పినప్పుడు ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలో చేయాలనుకున్నాను ఇందులో సోషల్ జాగృతి కోసం టీం అంతా కష్టపడుతుంటే నా వంతుగా నేను దర్శకుడు గోపి గారు చేస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అవ్వాలని ఈ సినిమా చేశాను. ఇందులో సోషల్ అవేర్నెస్ ద్వారా రియల్ ప్రాబ్లం ఉన్న ఒక విషయాన్ని మూవీ ద్వారా బయటికి తీసుకు వస్తే జనాలలో కొంతైనా మార్పు వస్తుందన్న ఉద్దేశంతోనే నేను ఈ నెగిటివ్ రోల్ ని సెలెక్ట్ చేసుకొని వర్క్ చేయడం జరిగింది
ప్రస్తుతం మన ఇండియన్ సినిమాను హలీవుడ్ వారు సైతం కాపీ కొడుతున్నారు. ఎందుకంటే మన సినిమాలో ఫైట్స్ , ఇంటెన్సిటీ, లుక్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.గోపి గారు కూడా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక స్టార్ కాస్ట్ కి వస్తే సత్య దేవ్ గారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ,సత్యదేవ్ గారు చాలా హార్డ్ వర్కర్ తనతో నా జర్నీ చాలా అద్భుతంగా సాగింది.తను చాలా బ్యాలెన్స్ నటుడు .తను వర్క్ లోకి దిగిన తర్వాత వర్క్ పూర్తి అయ్యేవరకు వదలకుండా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు.తనతో నాకు కొన్ని సీన్స్ ఉన్నాయి అవి నేను చాలా ఎంజాయ్ చేశాను.
పర్సనల్ లైఫ్ లో నేను కొన్ని కంపెనీ ల కు అడ్వైసరి రోల్ లో వున్నాను ఆ కంపెనీ ల బిజినెస్ గ్రోత్ కోసం వారు నా సలహాలు తీసుకుంటువుంటారు. అటు బిజినెస్ ఇటు యాక్టింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నా జర్నీని ఇక కొనసాగిస్తాను . నాకు తెలుగులో గాని బాలీవుడ్ లో గాని హాలీవుడ్ లో ఎక్కడైనా మంచి క్యారెక్టర్ దొరికితే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడిప్పుడే కొన్ని కథలు వింటున్నాను అవి ఏంటనేది త్వరలో తెలియజేస్తాను అన్నారు.