Father’s Day ని పురస్కరించుకొని

    0
    172

    నిజం …
    – నాన్న కు విలువ కట్టగలిగేది ఎవరు ??

    విలువ కట్టలేరు కాబట్టే
    నాన్నను వాడేసి –
    పక్కన పడేస్తారు ,
    Use and throw pen లాగా ,

    వయసున్నపుడు ఎక్కడా అమ్ముడుపోడు ,
    వయసయ్యపోయాక
    ఎవరికీ పనికి రాడు ..

    నిజంగానే – యే షరాబు , యే షావుకారు – ఏ ఆధునిక valuest అంచనాలకు అందనoత –
    విలువ గలవాడే కానీ ”
    ఆధునిక ప్రపంచంలో “వెల ”
    లేని వాడు నాన్న ..

    కొంటానికి కుదరని వాడు ,
    అమ్మడానికి చల్లని వాడు ,
    నాన్న …

    వయసు మీదపడ్డా …
    అమ్మయితే పనిమనిషి గానయినా పనికొస్తుంది ,
    కానీ ఇప్పుడు నానెందుకు పనికొస్తాడు ?
    తిని – తొంగోడానికి తప్ప ?
    నాగరికుల భాష లో
    వయసు మళ్ళిన
    ఓ వేస్ట్ ఫెల్లో నాన్న .

    వసున్నంత కాలం
    మనల్ని పెంచడానికి
    కాలంతో పోటీపడుతూ …
    అలుపెరగని అరేబియన్
    గుర్రంలా ,
    సంపాదనా చట్రం లో పడి
    నలిగిపోతాఉంటాడు .

    పాపం – పిచ్చోడు !!
    వృద్ధాప్యం దుప్పటి కప్పేస్తున్నా ..
    రంగులేస్తూ” తల “ను
    మన ఎదుగుదలను చూపిస్తూ తన “మనసు “ను …
    తానింకా కుర్రోడినే అనే భ్రమ కలిగించే ప్రత్నం చేస్తా , “ప్రపంచాన్నీ “..

    లేని సత్తువని , ఆనందాన్ని నటిస్తా తనను తాను
    మోసం చేసుకుంటా ,
    ఊహా ప్రపంచం లో
    బ్రతికే పిచ్చి వాడు .. నాన్న

    చివరిగా ..
    అంతా అయిపోయి ,
    మానాన్న చాలా మంచోడు
    అన్న ఓ “Tag “తగిలించబడి ,

    ఏ అనాధాశ్రమం లోనో
    ఏ ఓల్డ్ age house లో నొ ..
    ఒంటరగా నిర్ధురిస్తూ ,
    కదలని కాలాన్ని ,
    కరిగిన స్వప్నాలను
    భారం గా పక్కకు నెడుతూ ..
    అస్త మించే సూరీడోలే
    నిశ్శబ్దం గా నిష్క్రమించే
    వాడే -నాన్న

    నిజం
    నాన్న వేదన -విలువ యవరకు తెలుసు ??
    యే …ఊరు బయట పార్కల్లో నిస్తేజంగా పడివున్న బల్లలకో ..

    లేక యే
    బస్టాప్ లోనో , రైల్వే స్టేషన్లో నో
    నిరాధారం గా ఉన్న సగం విరిగిన కుర్చీలకో తప్పితే
    నాన్న వేదన -విలువ ఎవరకు తెలుసు ??

    ప్రేమ తో
    మీ

    ఈశ్వర్ ఆర్మీ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here