ఒక వ్యక్తి ఆలోచన దాని ప్రభావం మరో వ్యక్తి పై ఎలా చూపుతుంది అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ప్రీ ప్లాన్డ్”.జి. వి. ఆర్ క్రియేటివ్ వర్క్స్ పతకాంపై యోగి కటిపల్లి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడులు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “ప్రీ ప్లాన్డ్”.రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ లు జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24 న గ్రాండ్ గా విడుదలవుతుంది.ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, తాజాగా హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ రచయిత త్యాగరాజు ,ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గార్లు ఘనంగా విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ మాట్లాడుతూ..”ప్రీ ప్లాన్డ్” టైటిల్ తో పాటు ట్రైలర్ కూడా చాలా బాగుంది.ఈ చిత్ర నిర్మాతలు దర్శకుడు కొత్తవాడైనా కథపై ఉన్న నమ్మకంతో యోగి లాంటి కష్టపడే కొత్త డైరెక్టర్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం హర్షించ దగ్గ విషయం.ఇలాంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి రావడం వలన ట్యాలెంట్ ఉన్న అనేక మంది దర్శకులు వృద్ధిలోకి వస్తారు.ఈ మూవీ ప్రీమియర్ చూశాను.సినిమా బాగా నచ్చింది.చాలా మంది మాది చిన్న సినిమా అంటారు. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ముఖ్యం కాదు కథలో మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులే ఆ సినిమా ను పెద్ద సినిమాగా చేస్తారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీ ఇద్దరి కాంబినేషన్ లో మరిన్ని రావాలి . ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు. త్యాగరాజు గారు వంటి సీనియర్స్ ఈ సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమా బాగా ఉండడంతో నేను ఓటిటి లో రిలీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తాను.ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ లో 20 ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. వాటిలో మేము ఇప్పటి వరకు 558 సినిమాలను ఓటిటి లో విడుదల చేశాము .ఇప్పుడు రిలీజ్ చేస్తున్న “ప్రీ ప్లాన్డ్” 559 సినిమా.ఈ నెల 24 న విడుదల అవుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
ప్రముఖ రచయిత త్యాగరాజు.. ఈ మూవీ కొరకు దర్శకుడు యోగి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు .యోగి కథనునమ్మి సినిమా తియ్యడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేసే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి రావాలి .ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది .హీరో, హీరోయిన్స్ కాకుండా ఇందులో వారంతా చాలా చక్కగా నటించారు.ఈ సినిమాలో సున్నితమైన బావాలు ప్రేక్షకులను కదిలించేలా చేశారు.ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం టీం అందరికి మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత రాజేష్ మాట్లాడుతూ.. దర్శకుడు యోగి ఈ సినిమా కోసం చాలా కడ్డాడు.తను రాసుకున్న కథ నచ్చి ఈ సినిమా చేశాను.దర్శకుడు కొత్త వాడైనా సినిమా బాగా తీశాడు.మేము అనుకున్న దానికంటే ఈ సినిమా చాలా బాగా వచ్చింది.మా సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు. ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
చిత్ర దర్శకుడు యోగి మాట్లాడుతూ..ఈ సినిమా కోసం చాలా మంది సహాయ పడ్డారు. చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నాకు చిన్న తనం నుండే డైరెక్టర్ కావాలనే కోరిక ఉండేది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఇన్స్పిరేషన్ తీసుకొని 12 షార్ట్ ఫిల్మ్ తీశాను. అయితే నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ ను రాజేష్ గారే ప్రొడ్యూస్ చేశారు. షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవంతో సినిమా తియ్యాలని మంచి కథను రెడీ చేసుకొని చాలా మందికి చెప్పడం జరిగింది.నేను చేస్తున్న ప్రయత్నం, దర్శకుడు అవ్వాలానే నా తపన చూసి ఈ సినిమా కథ చెప్పామన్నారు. నేను చెప్పిన కథ నచ్చలేదు అన్నారు. నాకు ఈ కథపై ఉన్న నమ్మకంతో తక్కువ బడ్జెట్ లో నేనే సినిమా తీద్దామని ప్రిపేర్ అయిన టైం లో నిర్మాతలు జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడులు ఫోన్ ఈ సినిమా చేద్దాం అన్నారు.ఈ చిత్రానికి నటీ నటులు అందరూ చాలా సపోర్ట్ చేశారు. లీలు మంచి మ్యూజిక్ ఇచ్చారు.మందర్ సావంత్ డి. ఓ. పి,సంపత్ కుమార్ ఇలపురం ఎడిటింగ్ ఇలా ప్రతి ఒక్క టెక్నిషియన్స్ అందరూ ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. నిజానికి ఈ రోజు ఒక దర్శకుడిగా ఈ స్టేజ్ పై వున్నాను అంటే దానికి నిర్మాతలు జి.వెంకట రాజేష్ & శ్రీపతి నాయుడు లే కారణం. వీ రిద్దరూ లేకపోతే నేను లేను. రచయిత త్యాగరాజు గారు ప్రతి విషయంలో నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించారు.వారి సహాయం మరువలేను.మా సినిమాను ఎంకరేజ్ చేస్తూ ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్స్ సి.ఈ ఓ రాజీవ్ గారికి ధన్యవాదాలు.ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలి అన్నారు.
హీరో రాజ్ కమల్ గుంటుకు మాట్లాడుతూ..సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “ప్రీ ప్లాన్డ్ ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమైన “ప్రీ ప్లాన్డ్” లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
నెగెటివ్ క్యారెక్టర్ చేసిన సరస్వతి మాట్లాడుతూ..నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
లాయర్ క్యారెక్టర్ చేసిన సత్య మాట్లాడుతూ..దర్శకుడు యోగి షూటింగ్ లో వున్నప్పుడు అర్జునుడు లా ఫోకస్ పెట్టి మాతో పనిచేయించుకునేవాడు.అప్పుడు తను ఎం చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. ఆ తరువాత నా సీన్స్ కు నేను డబ్బింగ్ చెప్పినప్పుడు నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి.ఈ సినిమా ఔట్ పుట్ కూడా బాగా వచ్చింది. నటీ నటులు అందరూ చాలా కష్టపడ్డారు.ఈ సినిమా రిలీజ్ తరువాత యోగి కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అన్నారు.
నటీ నటులు
రాజ్ కమల్ గుంటుకు, వైష్ణవి సోనీ, టి. యన్. ఆర్., కవిత శ్రీ రంగం, సత్య ఏలేశ్వరం, శివ, వరహాల బాబు(కాటం రాయుడు), సరస్వతి, కోటి దేవి రెడ్డి, కమల్ దీప్, రాఘవ్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :జి. వి. ఆర్ క్రియేటివ్ వర్క్స్
సినిమా : “ప్రీ ప్లాన్డ్”
నిర్మాత : జి.వెంకట రాజేష్ &శ్రీపతి నాయుడు
రైటర్, డైరెక్టర్ : యోగి కటిపల్లి
డి . ఓ. పి : : మందర్ సావంత్
సంగీతం : లీలు
ఎడిటర్ : సంపత్ కుమార్ ఇలపురం
లిరిక్స్ : ఎ. జకీర్
కొరియోగ్రాఫర్ : జైజ్
వి. యఫ్. ఎక్స్ : రీల్స్ & రోల్స్ ఎంటర్ టైన్మెంట్
డి .ఐ.: బాను ప్రకాష్
5.1 : సుబ్బారావ్
పోస్ట్ : కొండారెడ్డి
డిజిటల్ : ఫిల్మ్ స్టూడియో
ప్రమోషనల్ పబ్లిసిటీ డిజైనర్ : ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్
యానిమేషన్ : సంతోష్ విజువల్ స్టూడియో
పి ఆర్ ఓ : మూర్తి