సంచలనాల దిశగా షికారు

0
227

శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ లో పిఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మాతగా హరి కొలగాని దర్శకత్వం లో రూపొందిన షికారు జూన్ 24 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఒక చిన్న సినిమా గా మొదలైన షికారు ప్రయాణం బిజినెస్ సర్కిల్ లో పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది. విడుదలకి రెండు వారాల ముందే వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ సురేష్ గారు ఫాన్సీ రేటు కి ఆంధ్ర ప్రాంతం హక్కులు సొంతం చేసుకున్నారు .. ఇదే సురేష్ గత వారం ఇలానే మేజర్ ఆంధ్ర హక్కులు కొనడం తన తర్వాతి సినిమా గా షికారు సినిమా ని చూసి ఫాన్సీ రేటు ఆఫర్ చేయటం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 24 న రిలీజ్ అవుతున్న షికారు చిత్రం లోని పాటలు థియేట్రికల్ ట్రైలర్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం తో ఎక్సిబిటర్స్ కూడా షికారు కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

నటీనటులు
సాయి దన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ, నవకాంత్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో కన్నడ కిషోర్, చమ్మక్ చంద్ర, రచ్చరవి, పోసాని, అన్నపూర్ణమ్మ, సురేఖ వాణి, సత్య శ్రీ, గాయత్రి రెడ్డి(బిగిల్ ఫేం)తదితరులు నటించారు

టెక్నికల్ టీమ్
బ్యానర్ : శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్
చిత్రం : షికారు
నిర్మాత: పిఎస్ఆర్ కుమార్ (బాబ్జి)
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: హరి కొలగాని
సహ నిర్మాత: సాయిపవన్ కుమార్
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం : భాస్కరభట్ల, హరి కొలగాని
డైలాగ్స్: విశ్వ కరుణ్
ఎడిటర్: వెంకటేశ్వరరావు ఎస్
కొరియోగ్రాఫర్: సుభాష్ సరికొండ
పీఆర్వో : వంశీ శేఖర్, తేజస్వి సజ్జా
పోస్టర్ డిజైన్స్: ధని ఏలే
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here