సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట ‘దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు.
రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, సమర్పణ: పవన్ కుమార్, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.



