నా నీటిరంగుల్లో పాటకు ప్రతిరూపం… బాలు – దేవీప్రసాద్

0
649

ఆయన పాడుతున్నప్పుడు చూడండి… చేసే పనిలో ప్రాణం ఎలా పెట్టాలో తెలుస్తుంది.
ఆయన మాట్లాడుతున్నప్పుడు చూడండి… మాట మంచిదైతే అది మంత్రమౌతుందని అర్ధమవుతుంది.
ఆయన స్నేహం చేసిన విధానం తెలుసుకోండి…. జనబలం పెరుగుతుంది.
ఆయన పనిచేసిన విధానం తెలుసుకోండి… ధనబలం పెరుగుతుంది.
వృత్తిరంగంలో ఆయన పట్టువిడుపులను గమనించండి… అవి ఎదగటానికి ఉపయోగపడే నిచ్చెనలని తెలుస్తుంది.
జీవితంలో గెలవాలనుకొనేవారు అధ్యయనం చేయాల్సిన వ్యక్తిత్వవికాస గ్రంధం “బాలు”.

విలువైన ఆ జన్మకు నా నివాళి.

(నా నీటిరంగుల్లో పాటకు ప్రతిరూపం) — దేవీప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here