Good evening రాజుగారు…
అక్కడ , మీరు ఎలా ఉన్నారు ??
వాస్తవానికి సినిమా లేకుండా
మీరెక్కడ ఎలా ఉన్నరోగానీ ..
మీరు లేకుండా “మేము , సినిమా ”
ముఖ్యం గా మన
తెలుగు సినిమా ..
పాపం మాలాగే బెంగ పెట్టుకుందో , ఏమో గానీ ..
కాసింత రంగు తగ్గింది .
BA Raju గారి –
చిరునవ్వు , మార్క్
సంపాదకీయం లేని లోటు
స్పష్టంగా తెలిసిపోతావుంది ..
నిజానికి
మేమంతా
మీ మార్కు “చిరు” నవ్వును
Miss అవుతూ నే ..ఉన్నాం -.
వాస్తవానికి
అది అoతటి శక్తివంతమైనది మరి ..
అగ్ని పర్వతo లో కృష్ణ గారిలా .. గుండెల్లో లావాలు రగులుతున్నా ….
ఎక్కడ తోనక్కా , బెనక్కా
యోధుడిలా సాగిపోయే
మీ పయనానికి ,
నెలవొంక
లాంటి మీ చురునవ్వు,
మీ వ్యక్తిత్వాన్ని మరింత
పరిపూర్ణం గా
పూర్ణ కుంభం లా మార్చి
మిమల్ని నడిపించి
గెలిపించిందంటే
అది అతిశయోక్తి యెంత
మాత్రం కాదు మరి …
మా బాదంతా , కేవలం
సంపాదకీయానికే.. అయితే …
మీ – తోటి వారు , తరువాత తరం వారు , మీ శిష్య గనం చాలానే ఉన్నారు …
అన్నిటిని మించి
ఎక్కడో – అలసట ఎరుగని ,
ఆగిపోనివ్వని కాంతి రేణువులాంటి
మీ మార్కు “చిరునవ్వు ”
మిస్ అవుతూనే ఉన్నాం…
ఇప్పుడు ..
పెద్ద – సినిమాల ప్రెస్సుమీట్లో
పెద్ద – హీరోల రిలీస్ ఫంక్షన్స్ లో
గంటల తరబడి
ఎదురు చూస్తూ అలసిపోయిన
యువ “పెన్నుల “మదిలో
పాదరసం లాంటి
కొత్తఉత్సహాo నింపే
మీ ప్రోత్సహక – చురునవ్వే
మిస్ అయి పోయింది ….
Missing you sir
Raju garu 🙏🙏
ప్రేమ తో
పాత “పూరి గారి ” ఆఫీస్ లో
మీ కాఫీ మిత్రుడు
ఈశ్వర్ -ఆర్మీ



