ఆహాలో ఏప్రిల్‌ 22న వరుణ్ తేజ్‌ ‘గని’ రిలీజ్‌

0
342
యంగ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘డీజే టిల్లు’, పవర్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ ‘భీమ్లానాయక్‌’…  తర్వాత యాక్షన్‌ ఫ్యామిలీ డ్రామా ‘గని’ని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర రావు, నవీన్‌ చంద్ర, జగపతిబాబు, నదియ లీడ్‌  రోల్స్ లో నటించిన సినిమా ‘గని’.
100 శాతం తెలుగు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్, అచ్చ తెలుగు లోగిళ్లలో ఆదరణ పొందిన తెలుగు ఓటీటీ ఆహా… ప్రతి శుక్రవారం కొత్త సినిమా ప్రసారం అని, తన అభిమాన ప్రేక్షకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది. ప్రతి శుక్రవారం సరికొత్త కంటెంట్‌తో అలరిస్తోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘గని’. తమన్‌ సంగీతం అందించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన సినిమా ఇది.
గని సినిమా విడుదలకు సంబంధించి పవర్‌ ప్యాక్డ్ యాక్షన్‌ ప్రోమోతో అనౌన్స్ చేశారు ఆహా టీమ్‌. మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ మునుపెన్నడూ కనిపించని అవతార్‌లో ఇందులో కనిపిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్‌కి పడ్డ కష్టమంతా, అందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఆహాలో…. భీమ్లానాయక్‌, డీజే టిల్లు, అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే, క్రాక్‌, బ్లడీ మేరీ, తెలుగు ఇండియన్‌ ఐడల్‌, సేనాపతి, సర్కార్‌, ది అమెరికన్‌ డ్రీమ్‌, ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం, లవ్‌ స్టోరీ, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, చావు కబురు చల్లగా, లెవన్త్ హవర్‌, నాంది, త్రీ రోజెస్‌, ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌, నీడ, కాలా, ఆహా భోజనంబు, ఒన్‌, సూపర్‌ డీలక్స్, చతుర్ముఖం, తరగతి గది దాటి, ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ, మహా గణేశ, సర్కార్‌, పరిణయమ్‌, ఒరేయ్‌ బామ్మర్ది, కోల్డ్ కేస్‌, అల్లుడు గారు, ఇచ్చట వాహనములు నిలపరాదు వంటి వాటికి విశేషమైన ఆదరణ దక్కుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here