గట్టు దాటి పుట్ట దాటి.. ఏడేడు ఏర్లు దాటి
కొండా దాటి కోన దాటి .. కోసు కోసు దార్లు దాటి
సీమా సింత నీడకొచ్చానె రంగు రంగు రామ్ చిలక సింగరాల సోకులు చూశానె’’అని అల్లం అర్జున్ కుమార్ తనకు కాబోయే భార్య గురించి పాట పాడుకుంటున్నారు. అసలు ఇంతకీ అల్లం అర్జున్ కుమార్ ఎవరు? దాని బాధేంటి? అనే విషయం తెలియాలంటే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘రామ్ చిలక..’ అనే పాటను రిలీజ్ చేశారు.
జె క్రిష్ సంగీతం అందించిన ఈ పాటను విజయ్ కుమార్ భల్లా, రవి కిరణ్ కోలా రాశారు. రవి కిరణ్ కోలా పాటను పాడారు. జానపదం స్టైల్లో పాట ఉంది. ఇందులో విశ్వక్ సేన్ లుక్ డిఫరెంట్‌గా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలకు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు:
విష్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
సమర్పణ: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే : రవి కిరణ్ కోలా
బ్యానర్: ఎస్.వి.సి.సి.డిజిటల్
నిర్మాతలు: బాపినీడు, సుధీర్ ఈదర
సినిమాటోగ్రఫీ: పవి కె.పవన్
సంగీతం: జై క్రిష్
రచన: రవికిరణ్ కోలా
ఎడిటర్: విప్లవ్
ప్రొడక్షన్ డిజైనర్: ప్రవల్య దుడ్డిపూడి
పి.ఆర్.ఓ : వంశీ కాకా