జీవితమనే “రంగస్థలం ” మీద
మనందరం “పాత్ర “దారులం తెలిసో , తెలియకో
ఇష్టం గానొ ,కష్టం గానో
భయం తో నో ,
భాద్యత తోనో ,
బ్రతికినంతకాలం
మనందరం నటిస్తూనే ఉంటాం .
అలా
ఉండాలి కూడాను .
ఎందుకంటే !!
చలించని వాడు “మరణించిన ” వానితో తో సమానం,
అని సైన్స్ చెబుతుంది …
ప్రపంచమే ఓ రంగస్థలం
నువ్వు అందులో ఓ నటుడివి
అంటారు ….
ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయిత
“షేక్స్ స్పియర్ “….
నిజమే …
మనం నటించడం లేదు …!!
అంటే తొందరలోనే మన మనజీవితమనే
రంగస్థలానికి తెర పడిపోబోతుందని అర్ధం …
“నాటకం ” అంటే
భావవ్యక్తీ కరణ
మన నిజ జీవితాలలోని సంఘటనలను , సన్నివేశాలనూ
కథలుగా మార్చి
అభినయాన్ని “కళగా “భావించన కొందరు రసజ్ఞులు
ఆ రసాను భూతిని పదిమందికి పంచె ప్రక్రియకు ప్రతిరూపమే
నాటకం ….
మనిషి ఆవిష్కరించిన భావవ్యక్తీకరణ ప్రక్రియల్లో
అతి సహజమైన , సరళమైన ,
మహోన్నతమైన ,
మహా అద్భుతమైన
ప్రక్రియే “నాటకo ” అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు ..
నాటకం
అనాదిగా మనిషి , జీవన విధానం , సంస్కృతి , చారిత్రక సంఘటనలను
తన ప్రతిరూపం గా మోస్తూ …కాలం తో పాటు జీవిస్తా ఉంది … చిరంజీవి లా ……
సహజం గా మనకు ఎదుటి వారిపై కోపమొస్తే .. ఏరా !!నాటకాలు ఆడుతున్నావా !!
అంటాం …
మనమేదో ఆడటం లేనట్లు ??
వాస్తవానికి,
మనందరిలోనూ
గొప్పనటులు ఉన్నారని
గొప్ప గ నటించడమంటే !!
గొప్పగా జీవితాన్ని అవగాహన – చేసుకోవడమని …
వారికే జీవితం లో ఎక్కడ తగ్గాలో
ఎక్కడ నెగ్గాలో బాగా తెలుస్తుందని ,
నటించడం అందరిలోనూ
సహజంగా ఉన్న కళే అయినా !!
నేను మంచి నటుడిని అని
తెలియడం గొప్ప పరిణితికి
సంకేతమని మనందరం గ్రహించి
జీవితం లో పూర్తి పరిణితి తో
గొప్ప – నటులుగా
వ్యక్తులుగా ముందుకు సాగాలని కోరుకుంటూ ….
అలాంటి గొప్ప రంగస్థల ,
సినిమా నటులకు నిలయమైన మన తెలుగు భాషను – నాటక రంగ ఆచార్యులు ”
శ్రీ బళ్లారి రాఘవగారిని ”
స్మరించుకుంటూ …
నాటకానికి – శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ
ప్రేమతో మీ – ఈశ్వరుడు
Www.eswararmy.com



