నీరు (The Water ) – ఈశ్వర్ జి

0
307

నీరు -ప్రకృతి యొక్క “గర్భ సంచి ” అంటే అది అతిశయోక్తి కాదేమో …
( water is the womb of the Nature )
ఈ అనంతమైన విశ్వం లో యావత్ జీవకోటి నీటినుండే ఉద్భవించిందన్నది శాస్త్రం …

అందుకే యుగాలుగా మనిషి
నదుల వెంబడి వోల్గా – నుంచి గంగకు నీటి తోనే ప్రయాణిoచి
దూరాలను జయించాడు
ఆ … ఆదిమ మానవుని కృషిని
ఆధునికత పేరుతొ
“మనం “ప్రకృతిని
ద్వoసం చేస్తున్నాం .

అయితే “అతి ” అన్ని అనర్దాలకు మూలం అన్నట్లు ..

నేడు మనిషి ని అడుగింటుతున్న
నీటి నిల్వలు
తన అస్తిత్వాన్ని గురుతు చేస్తూ
తన మనుగడను ప్రశ్నిస్తున్నాయి ??..

అందుకే మన శాస్త్రవేత్తలు
నీటి చుక్క కోసం ఖగోళ మండలం అంతా జల్లెడ పడుతున్నారు ..

భూమిలాంటి గ్రాహం ఇంకెక్కడైనా ఉందా !!అని ఆశ గా వెతుకుతున్నారు …

ఎందుకంటె ఎక్కడ నీరు లభిస్తుందో అక్కడ జీవం ఉందని అర్ధం …
విశ్వం లో ఇంకెక్కడైనా
“నీరు” ఉంటే
అక్కడ మనకు శతృవో , మిత్రుడో ఉన్నాడని అర్ధం ..

ఎవరో ఏదో ఒక
గ్రాహం వారు
గుక్కెడు నీళ్లిచ్చి
ఆదుకోక పోతారా అని
పాలపుంతల వెంబడి
నీళ్లకోసం వెంపర్లాడే
రోజులు రాకముందే
మనం కళ్ళు తెరవాలి ..

అందుకే ఈ save water concept …

జలో రక్షిత రక్షితః
మనిషి నీటిని కాపాడు కుంటే
నీరు – యావత్ జీవ కోటిని కాపాడుతుంది …
తధాస్తు …

ప్రేమ తో మీ
ఈశ్వర్ జి ఆర్మీ 🙏💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here