అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహా, అద్భుతమైన తెలుగు వినోదానికి ఇంటికి పేరు. సినీ ప్రేమికులకు, స్వచ్ఛమైన వినోదాన్ని అభిలాషించేవారి కోసం టాప్ క్లాస్ వెబ్ షోలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఒరిజినల్స్ ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ సినీలోకంలో ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరి హృదయాలనో కొల్లగొట్టిన ఆహా, దిగ్విజయంగా రెండు వసంతాలను పూర్తి చేసుకుని డిజిటల్ స్పేస్‌లో దినదినాభివృద్ధి చెందుతూ తెలుగువారికి సరికొత్త అలవాటుగా మారింది.
దాదాపు 50 మిలియన్ల యూనిక్ విజిటర్స్, రికార్డు స్థాయిలో ఇన్‌స్టాల్స్ తో అందరి నోటా ఆహా అనిపిస్తోంది తెలుగు ఓటీటీ స్పేస్‌లో అచ్చతెలుగు ఆహా. ప్రేక్షకుల అభిమానాన్ని చూసి తరిస్తున్న ఆహా, వారి కోసం మంచి ఆఫర్ ఇస్తోంది. ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ని రూ.399కి బదులు రూ.299కే అందిస్తోంది. ఈ వార్షిక రాయితీతో కూడిన రుసుము ఫిబ్రవరి 22 వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది.
వైవిధ్యమైన కంటెంట్ విషయంలో రారాజు ఆహా. అది వెబ్ షోస్ పరంగా కావచ్చు, ఒరిజినల్స్ విషయంలో కావచ్చు. సినిమాల పరంగానూ కావచ్చు. విషయం ఏదైనా ఆహా మాత్రం అందరి చేతా శభాష్ అంటూ ప్రశంసలు అందుకుంటోంది. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే, ప్రదీప్ మాచిరాజు అరుదైన గేమ్ షో సర్కార్, మంచు లక్ష్మి షో ఆహా భోజనము, శ్రీముఖి హోస్ట్ గా చెఫ్ మంత్ర.. ఇవన్నీ నాన్‌ఫిక్షన్ స్పేస్‌లో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఆహా షోలు.
తెలుగువారి కొత్త అలవాటుగా మారిన ఆహాలో సినీ వినోదానికి కరువే లేదు. హై ప్రొఫైల్ సినిమాలు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లవ్‌స్టోరీ, ఎస్ ఆర్ కల్యాణమండపం, క్రాక్, నాంది, జాంబి రెడ్డి వంటివన్నీ ఆహాలోనే అందుబాటులో ఉన్నాయి. మస్తీస్, లాక్ట్ , కొత్త పోరడు, కుడి ఎడమైతే, ది బేకర్ అండ్ ది బ్యూటీ, మహా గణేశ, తరగతి గదిదాటి, త్రీ రోజెస్ వంటివన్నీ వెబ్ షోస్ చూసే అలవాటున్నవారికి మరింత రుచికరమైన విందుభోజనాలను వడ్డించినవే. అటు మెయిల్, సేనాపతి, జోహార్, కలర్‌ఫోటో వంటి ఒరిజినల్స్ కి జనాదరణ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలు ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు ఆహా. వారి పాపులారిటీతో అనూహ్యమైనరీతిలో ఆకాశాన్ని తాకింది ఆహా కీర్తి. నందమూరి బాలకృష్ణ, సమంత, రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి, లక్ష్మీ మంచు, అమలాపాల్, సంతోష్ శోభన్ వంటి తారలు, నందినిరెడ్డి, మారుతి, పవన్ కుమార్, క్రిష్ జాగర్లమూడి, పవన్ సాధినేని వంటి ఫిల్మ్ మేకర్స్ కూడా ఆహా కీర్తి నలుదిశలా రెపరెపలాడటానికి గత రెండేళ్లలో తమవంతు సహకారం అందించినవారే.
ఆహా లాంచ్ చేసిన 2.0 వెర్షన్ ప్రేక్షకుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేసిందనే చెప్పాలి. అత్యుత్తమ సదుపాయాలు, సరైన సిఫారసులు, స్మార్ట్ ప్లేయర్ వెసులుబాటు, 5.1 డాల్బీ డిజిటల్ ఎక్స్ పీరియన్స్, పారెంటల్ కంట్రోల్, అందుబాటుధరలు… ఇలా ప్రతి విషయంలోనూ ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి వచ్చింది ఆహా.
ప్రస్తుతం ఆహా ముందున్న అత్యుత్తమ లక్ష్యం తెలుగు ఇండియన్ ఐడల్‌కి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడమే. సౌత్ ఇండియాలో ఈ తరహా ఇండియన్ ఐడల్ తొలిసారి కావడం గమనార్హం. శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఇండియన్ ఐడిల్‌కి ఇప్పటికే విశేషమైన ప్రాచుర్యం దక్కింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఆడిషన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులందరూ తమ గళాన్ని పరిచయం చేసుకోవడానికి దీన్ని సదవకాశంగా భావిస్తున్నారు.
అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోజెస్, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, సర్కార్, చెఫ్ మంత్ర, అల్లుడు గాడు, క్రిస్‌మస్ తాత…వీటిలో ఏం చూడాలన్నా ఇమీడియేట్‌గా ఆహాను ఓపెన్ చేయాల్సిందే. మరింత గొప్ప వినోదం కోసం మనముందున్న అద్భుతమైన ఆప్షన్ ఆహా!



