కర్ణ చిత్రంలోని ‘గుడి యనక నా సామి’ పాటను విడుదల చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

0
250

యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం కర్ణ. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై కళాధర్ కొక్కొండ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో హీరో గా నటిస్తుండడం విశేషం. మోనా ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంత్ BJ సమకూరుస్తుండగా శ్రవణ్ G కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గీతామాధురి ఈ పాటను ఆలపించగా అనిల్ సాహిత్యాన్ని అందించారు.కిరణ్ బందర్ కొరియోగ్రఫీ అందించారు. త్వరలోనే ఈ సినిమా ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచింది. తాజాగా ఈ సినిమా నుంచి  ‘గుడి యనక నా సామీ’ పాటను విడుదల చేసింది చిత్రం. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటను విడుదల చేయడం విశేషం.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. కర్ణ సినిమాలోని గుడి యనక నా సామీ పాటను విడుదల చేస్తున్నందుకు  ఎంతో సంతోషంగా ఉంది. కిరణ్ బండార్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. తప్పకుండా ఈ పాట మీ అందరిని ఆకట్టుకుంటుంది. అందరికీ అల్ ది బెస్ట్ అన్నారు.

కాస్ట్: కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
నిర్మాత: కళాధర్ కొక్కొండ
బ్యానర్: సనాతన క్రియేషన్స్
మ్యూజిక్: ప్రశాంత్ BJ
DOP: శ్రవణ్ G కుమార్కొరియోగ్రఫీ : కిరణ్ బండార్
ఆడియో: మధుర ఆడియో
పీఆర్ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here