మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’

0
223

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్‌ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `సర్కారు వారి పాట` చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్లు ఈ మూవీని మే 12న విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా  ప్రకటించారు. వేస‌వి సెలవులను ఈ చిత్రం పూర్తిగా ఉప‌యోగించుకోనుంద‌ని తెలుస్తోంది.

సర్కారు వారి పాట మూవీలో మహేష్ బాబును సరికొత్త అవతారంలో చూపించబోతోన్నారు దర్శకులు పరుశురాం. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
ఈ చిత్రానికి మ‌హేశ్‌ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ కానున్నాయి.

ఇక సర్కారు వారి పాట టీం  ఇప్ప‌టికే మ్యూజిక‌ల్  ప్రమోషన్స్‌ను మొద‌లుపెట్టింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ కాబోతుంది. ప్ర‌స్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు తమన్ అద్భుతమైన రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రెడీ చేశారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ మహేశ్ బాబు ప్రియురాలిగా అల‌రించ‌నుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై  నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

నటీనటులు: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు

సాంకేతిక బృందం
రచన‌, దర్శక‌త్వం: పరుశురామ్ పెట్లా
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్  ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సీఈవో: చెర్రీ
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here