శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి – న్యాచురల్ స్టార్ నాని

0
370

న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు నాని మీడియాతో ముచ్చటించారు.

నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.

కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం. ఏవో సెట్లు వేసాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రొడక్ట్ మొత్తం పూర్తయిన తరువాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

కమల్ హాసన్ నాయకుడు.. ఈ సినిమాకు సంబంధం ఉండదు. కానీ కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. శ్యామ్ సింగ రాయ్ కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు.

క్యాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ప్రతీ రోజూ రెండొందల మంది ఉండేవారు. వారికి కూడా స్పెషల్ క్యాస్టూమ్స్ డిజైన్ చేశారు.

ఇందులో డైరెక్టర్‌గా పని చేశాను. నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ వాసుకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలను మాత్రం ఇందులో చూపించలేదు. ఎంటర్టైనింగ్ గానే చూపించాం.

కథ చెప్పిన వెంటనే పాత్రలోకి లీనమయ్యాను. దీనిక గనుక కరెక్ట్ టీం దొరికితే అదిరిపోతుందని తెలుసు. దాదాపు ఐదు నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు పకడ్భందీగా చేశారు.

శ్యామ్ సింగ రాయ్‌లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని ఎపిసోడ్స్‌లా చూడటం నాకు నచ్చదు. కానీ అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతంగా ఉంటాయి. అవి స్టోరీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.

జెర్సీ డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్..శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్‌ను అలా చూసి షాక్ అయ్యాను. అంతలా ఎప్పుడూ మాట్లాడలేదు. సెటిల్డ్‌గా ఉండే వారంతా కూడా వారి ఎనర్జీని అలా దాచుకుంటారేమో. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

బెంగాలీలో షూట్ చేసిన సమయంలో అక్కడి వ్యక్తే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండేవారు. మాట తీరు, పలికే విధానంలో ఎంతో తేడా ఉంటుంది. శ్యామ్ నాన్న బెంగాలీ, అమ్మ తెలుగు. శ్యామ్ ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాడు. అక్కడక్కడా బెంగాలీ లేకపోతే ఆ అతేంటిసిటీ రాదు అని కొన్ని డైలాగ్స్ పెట్టాం.

శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారుతాడు అనేది సినిమా. శ్యామ్ సింగ రాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం.

ఇప్పుడు వరుసగా సినిమాలున్నాయి. ఈ సమయంలో కాస్త గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వరకే. ఆ తరువాత సినిమానే చూసుకుంటుంది. అయినా మాకు ఈ సినిమా ఎలా వచ్చిందో తెలుసు. ఎంతో నమ్మకంగా ఉన్నాం.

ఎంసీఏ సినిమాకు టక్ జగదీష్ సినిమాకంటే తక్కువగా రివ్యూలు వచ్చాయి. కానీ నా కెరీర్‌లో ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్. అయితే వీ, టక్ జగదీష్ సినిమాల పట్ల నిర్మాతలు, అమెజాన్ కూడా హ్యాపీగా ఉంది. హయ్యస్ట్ వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని అన్నారు. కానీ ఇక్కడ మీకు ఎంసీఏకు చూపించినట్టుగా లెక్కలు చూపెట్టలేకపోతోన్నాం. ప్రేక్షకులంతా సినిమాలు చూడాలని అనుకున్నామంతే.

నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. సినిమా కోసం పని చేసినవారంతా సంతోషంగా ఉండాలి. రెగ్యులర్‌గా పని చేస్తుండాలి. ఆ పనిని ఆపకూడదు. అది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు.

జెర్సీ తరువాత నాకు ఎంతో సంతృప్తినిచ్చింది శ్యామ్ సింగ రాయ్. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఉంది.

కెమెరామెన్ సాను ఎప్పుడూ కూడా తన కెమెరాపనితనం బాగుండాలని చేయరు. సినిమా బాగుండాలని చేస్తారు. ఆయన చేసే ఒక్కో సినిమాకు అస్సలు సంబంధం ఉండదు. కథను చూపించే కెమెరామెన్లలో మొదటి వరసలో టాప్ పొజిషన్‌లో ఉంటారు.

నా కెరీర్‌లో ఏ సినిమా చేసినా.. అప్పటి వరకు అదే హయ్యస్ట్ బడ్జెట్. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్. ఆ తరువాత దసరా. ఇలా ప్రతీ ఒక్కటి ఆ సమయానికి హయ్యస్ట్ బడ్జెట్ అవుతుంది. గ్రోత్ అలా పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు మార్నింగ్ షోకు నేను అనుకున్న టాక్ వస్తే ఎవ్వరూ ఆపలేరు.

కృతి శెట్టి చాలా కొత్త. కానీ నేర్చుకోవాలనే తపన ఉంది. ప్రతీ విషయాన్ని రాహుల్, నన్ను అడుగుతూ ఉండేది. అలాంటి క్వాలిటీ ఉండటం చాలా మంచిది.

సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల గారు అన్నట్టుగా రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు. ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన శ్యామ్ సింగ రాయ్‌కు రాయడం అనేది వరం. ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది.

అంటే సుందరానికీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఏప్రిల్ వచ్చే అవకాశం ఉంది.

శ్యామ్ సింగ రాయ్ కోసం ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు. రిఫరెన్స్‌లు తీసుకోలేదు. శ్యామ్ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాను. చిన్నప్పటి నుంచి మన జీవితంలోనే ఎన్నో రిఫరెన్స్‌లుంటాయి.

ఎంసీఏకి ఇప్పటికీ సాయి పల్లవి అలానే ఉంటుంది. అందులో ఓ నాలుగు సీన్లుంటాయి. మా సీన్లు అందరికీ కనెక్ట్ అయ్యాయి. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇంటెన్సిటీ, పర్ఫామెన్స్ వంటివి నమ్మేవాళ్లం. ఇంకోసారి కలిసి సినిమా చేస్తే ఈ ప్రపంచానికి దూరంగా ఉండే పాత్రలు రావాలని అనుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని అనుకున్నాం. అలా శ్యామ్ సింగ రాయ్‌తో రాబోతోన్నాం. ఇకపై మా బాధ్యత మరింత పెరుగుతుంది. ఈ సినిమా లో సాయి పల్లవి భుజాల మీద బరువు ఎక్కువగా ఉండబోతోంది.

దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి.

బాలకృష్ణ గారి గురించి బయట ఎన్నెన్నో వింటాం. కానీ అవేవీ నిజం కావు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. అందరితోనూ ఒకేలా ఉంటారు.

నా తదుపరి చిత్రాలు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తాం. హిందీకి సరిపడా కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. జెర్సీ సినిమా పాన్ ఇండియాగా చేయాల్సింది. కానీ అప్పుడు ఆ ఆలోచన రాలేదు. నేను చేయలేదు కాబట్టి షాహిద్ కపూర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా? (నవ్వులు)

ఈగ సినిమాతో సౌత్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యాను. నాని అంటే మా హీరో అన్నంతగా మారిపోయాను. చెన్నై, బెంగళూరు వంటి చోట్లకు వెళ్తే జనాలు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు.

కథ సెట్ అయితే ద్విభాష చిత్రం చేస్తాను. టక్ జగదీష్ సినిమాను ఎక్కడా రిలీజ్ చేయలేం. ఎందుకంటే అది మన తెలుగు నేటివిటీని చూపించే సినిమా. ఓటీటీ వల్ల ప్రతీ ఒక్కరూ ప్రతీ భాషలోని సినిమాను చూస్తున్నాం. కంటెంట్ ఉన్న వాళ్లే స్ట్రాంగ్. కథను పాన్ ఇండియన్ చేయాల్సిన పని లేదు. కథే పాన్ ఇండియన్ అవుతుంది. మనం కష్టపడి దాన్ని పాన్ ఇండియాగా చేయాల్సిన పని లేదు.

తెలుగులో ఇప్పటి వరకు టచ్ చేయని కలర్, జానర్‌లో దసరా ఉంటుంది. తెలంగాణ వాళ్లు కూడా పలకలేని స్పష్టమైన యాసలో ఉంటుంది. మరీ పీరియడ్ కాదు కానీ.. ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here