సితార ఎంటర్ టైన్మెంట్స్ ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ తామర ‘

0
422

టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని ‘ తామర ‘ పేరుతో నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ.  ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన రవి. కె. చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల ‘భీమ్లా నాయక్‘ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ‘ తామర ‘ కి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఓ అమ్మాయి తల ఓ పక్కకు తిప్పుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్ లో నిర్మితమవుతున్న ఈ ‘ తామర ‘ చిత్రం కథ కథనాలు అత్యంత ఉత్సుకతను కలిగిస్తాయని తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ‘జెర్సీ‘ చిత్రం జాతీయ పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇప్పుడీ అంతర్జాతీయ చిత్రం నిర్మాణం ప్రకటన సినీ వర్గాలలో అమితాసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగ వంశీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here