నవంబర్ 12న ‘అతడెవడు’ చిత్రం విడుదల

0
221

ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌పై సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన చిత్రం ‘అతడెవడు’. అన్ని కమర్షియల్ విలువలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. టీజర్ చూసిన సినీ ప్రముఖులు ఫోన్ చేసి మరీ అభినందించారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనరే కాకుండా యూత్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము..’’ అని తెలిపారు.

సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి
సంగీతం: డ్రమ్స్ రాము
కెమెరా: డి. యాదగిరి
డైలాగ్స్: కాకుమని సురేష్, బయ్యవారపు రవి
నిర్మాత: తోట సుబ్బారావు
దర్శకత్వం: వెంకట్ రెడ్డి నంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here