అక్టోబర్ 22న థియేటర్లలో “మిస్సింగ్”

0
261
Missing-release-date-poster

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “ మిస్సింగ్ ”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “ మిస్సింగ్ ” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ మిస్సింగ్ ” చిత్రం అక్టోబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా..

నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ…
“మిస్సింగ్” ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్,సెకండ్ వేవ్ లను తట్టుకుని లాక్ డౌన్ లో పట్టుదలగా సినిమాను కంప్లీట్ చేశాం. అక్టోబర్ 22న మా చిత్రాన్ని థియేటర్ ల ద్వారా మీ ముందుకు తీసుకు రాబోతున్నాం.
మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ…

మమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న అన్నయ్య బన్నీ వాసు కు థాంక్స్. ఈ కొవిడ్ వల్ల 2020 మిస్
అయ్యింది. 2021 కూడా మిస్ కాకుండా ఉండాలని ఈ నెల 22 న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఒక థ్రిల్లర్ జానర్ మూవీ చేయాలనే కోరికతో ఈ స్టోరీ అనుకున్నాం. సినిమాటోగ్రాఫర్ జన లేకుంటే మిస్సింగ్ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. మిస్సింగ్ లో బెస్ట్ మ్యూజిక్ వింటారు. థియేటర్ లో సినిమా
ఉండాలనేది మా కోరిక. అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ సాంగ్  కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిస్సింగ్ మూవీ నా టీమ్ ఎఫర్ట్ అందరం ఈ నెల  22 వ తేదీ కొరకు అందరం ఎదురు చూస్తున్నాం అన్నారు.

సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి

సాహిత్యం -వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ – వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ – టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ – దీక్ష రెడ్డి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ – దార రమేష్ బాబు, పైట్స్ –
పి. సతీష్, డాన్స్ – బంగర్రాజు, జీతు, స్టిల్స్ – గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ – బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం – అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ – జనా. డి, పీఆర్వో – జీఎస్ కె మీడియా, నిర్మాతలు – భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం – శ్రీని జోస్యుల.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here