సెప్టెంబర్ 11న విడుదల అవుతున్న ప్రిన్స్ ” ఐయామ్ మీరా “

0
215

శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్ బ్యానర్ లో యంగ్ హీరో ప్రిన్స్, దివ్యంగానా హీరో హీరోయిన్లుగా గోపాల కిషన్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిలర్ మూవీ ” Iam మీరా “. గుగ్గిళ్ల శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకొస్తుంది.. ఈ సందర్భంగా

చిత్ర దర్శకుడు గోపాల కిషన్ మాట్లాడుతూ : ఐయామ్ మీరా చిత్ర కథ విని గుగ్గళ్ల శివప్రసాద్ గారు ప్రోడ్యూస్ చెయ్యడానికి ముందకొచ్చారు అన్నారు.. అంతేకాకుండా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అన్నారు..

నిర్మాత గుగ్గిళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ : దర్శకుడు గోపాల కిషన్ చెప్పిన స్టోరీ చాలా కొత్తగా అనిపించడంతో సినిమా నిర్మించామని అన్నారు.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి యంగ్ హీరో ప్రిన్స్ అయితే న్యాయం చెయ్యగలడనే ఉద్దేశ్యంతో సంప్రదించాము… స్టోరీ వినగానే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేశాడని అన్నారు… ఇందులో ప్రిన్స్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్ లో ఉంటుందని.. ఈ సినిమాలో ప్రిన్స్ సరికొత్తగా కనపడుతాడు అన్నారు.. ఈ సినిమా ఆద్యంతం మంచి ట్విస్ట్ లు , సస్పెన్స్ తో నడుస్తుందని …సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా బాగా నచ్చుతుందని అన్నారు.. దర్శకుడు గోపాల కిషన్ చాలా కష్టపడి మంచి అవుట్ పుట్ తీసుకోచ్చారని తెలిపారు…

బ్యానర్ :శ్రీ శివ భవాని సినిమా ప్రోడక్షన్స్
హీరోహీరోయిన్లు : ప్రిన్స్, దివ్యంగానా
దర్శకత్వం : గోపాల కిషన్
నిర్మాత : గుగ్గిళ్ల శివప్రసాద్
కో_ ప్రోడ్యూసర్స్ : గుగ్గిళ్ల రాము, గుగ్గిళ్ల నాగ భూషణం.
సంగీతం : భరత్
కెమెరా : ప్రభాకర్ రెడ్డి. జె
పాటలు : గణేష్ చిన్న మెస్రం
ఎడిటర్ : బసవ రెడ్డి పైడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here