సూపర్‌స్టార్ మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’ లేటెస్ట్ మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అందరిలో ఆసక్తిని పెంచుతోన్న ఈ చిత్రం గత పదిరోజులుగా డిజిటల్ మీడియాలో డెయిలీ అప్‌డేట్స్‌తో హల్‌చల్ చేస్తోంది. ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా గ్రాండ్ బర్త్‌డే స్పెషల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి ఫస్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఇది సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అందులో మహేశ్ లుక్ ఇది వరకెన్నడూ లేనంత కొత్తగా అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ బ్లాస్టర్ టైమ్‌ను జీఐఎఫ్‌లో అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 9న ‘సర్కారువారి పాట’ నుంచి ఆగస్ట్ 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు వీడియో విడుదలవుతున్నట్లు ప్రకటించారు.
ఫస్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో మహేశ్ బ్యాక్‌పోజులో చేతిలో బ్యాగుతో ఉన్న పోస్టర్ విడుదలైంది. ఇప్పుడు జీఐఎఫ్ మహేశ్ ఫ్రంట్ పోజుతో నడుముకున్న బెల్టును కట్టుకోవడాన్ని చూడొచ్చు. మహేశ్ లుక్ కూల్, ఛార్మింగ్‌గా ఉంది. ప్రమోషనల్ స్ట్రాటజీతో హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ ఎలా ఉండబోతుందోననే అంచనాలు ఆశాకాన్నంటాయి. సినీ ప్రేక్షకులు, అభిమానులు డైరెక్టర్ పరశురాం.. సూపర్‌స్టార్ మహేశ్‌ను ఈ పక్కా కమర్షియల్ ఫిల్మ్‌లో ఎంత కొత్తగా ఎలివేట్ చేస్తాడోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఆర్.మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటర్. ఎ.ఎస్.ప్రకావ్ ఆర్ట్ డైరెక్టర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాశ్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్
సి.ఇ.ఓ: చెర్రీ
వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: యుగంధర్