హీరో రామ్ కార్తీక్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన “తెలిసిన వాళ్ళు” చిత్ర బృందం

0
257

“తెలిసినవాళ్ళు” టైటిల్ వినగానే తెలుగు ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు  యుట్యూబ్ లో ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న ఈ చిత్రాన్ని సిరెంజ్ సినిమా నిర్మిస్తుంది.. కేఎస్వీ ఫిలిమ్స్ సమర్పణలో సిరెంజ్ సినిమా పతాకంపై రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ నటీ,నటులుగా విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ‘తెలిసినవాళ్లు’. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్స్ కు వెళ్ళబోతున్న సందర్భంగా చిత్రంలోని హీరో రామ్ కార్తీక్‌ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…  ఈ చిత్రం నుండి ఇంతకు క్రితం విడుదల చేసిన హెబ్బా పటేల్  ఫస్ట్ లుక్ కి ఎంతటి ఆదరణ లభించిందో.. అలాగే హీరో రామ్ కార్తీక్ లుక్ కూడా మంచి స్పందన లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కోవిద్ కారణంగా షూటింగ్ డిలే అయ్యింది మరల ఇప్పుడు హీరో లుక్ కి మంచి స్పందన రావటం తో ఇప్పటి నుంచి విన్నూతనమైన రీతిలో ప్రమోషన్స్ చేయబోతున్నాం. హీరో,హీరోయిన్స్ రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ లు ఇద్దరూ చాలా బాగా నటించారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తో పాటు మిగిలిన సీనియర్ నటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. మా సినిమాకు పనిచేస్తున్న టెక్నీషియన్స్ వారు ఫిలిం స్కూల్  లో గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసుకొని మా సినిమాకు సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మిత మవుతున్న మా చిత్రం ఒక సాంగ్ మినహా దాదాపుగా 90 శాతం షూటింగ్  పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం  చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సిద్ధమైంది అని అన్నారు.

నటీనటులు
రామ్ కార్తీక్, హెబ్బా పటేల్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు

సాంకేతిక నిపుణులు
మూవీ: “తెలిసినవాళ్ళు”
సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్
నిర్మాత: సిరెంజ్ సినిమా
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి
ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్
కూర్పు: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: దీపక్ వేణుగోపాలన్
సాహిత్యం: డాక్టర్ జివాగో
కళ: ఉపేందర్ రెడ్డి
కోరియోగ్రఫీ: జావేద్ మాస్టర్, శైలజ మాస్టర్
ఫైట్స్: సీ హెచ్ రామకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డాక్టర్ జేకే సిద్ధార్థ
కో డైరెక్టర్ : కటిగళ్ళ సుబ్బారావ్
డిజిటల్ మీడియా : ప్రసాద్ లింగం , ధీరజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here