టాలీవుడ్‌లో వినయ విధేయరామ, భరత్ అనే నేను చిత్రాల్లో నటించి మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నారు. శనివారం(జూలై 31) కియారా అద్వాని పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా…
కియారా అద్వాని మాట్లాడుతూ “ఇప్పటి వరకు నా పుట్టినరోజు వచ్చిన గిఫ్ట్స్‌లో కచ్చితంగా ఇది బెస్ట్ బర్త్ డే గిఫ్ట్. చరణ్, శంకర్‌గారు, రాజుగారు, శిరీశ్‌గారు..ఇంత పెద్ద కాంబినేషన్‌లో సినిమా చేస్తుండటం నాకు చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. అలాగే నెర్వస్‌గానూ అనిపిస్తుంది. చాలా గొప్ప అవకాశం. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను“ అని అన్నారు.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్రమిది. అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, తమిళ,, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ రూపొందనుంది.