2017 లో విజయవంతమైన గీత సుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. అందులో సుబ్రహ్మణ్యం గా ప్రేక్షకులను తన నటనతో ఎంతో ఆకట్టుకున్న మనోజ్ కృష్ణ తన్నీరు తన తొలి చిత్రం నిన్ను చేరే తరుణం తో ఆర్టిస్ట్ క్రియేషన్ బ్యానర్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవ్వబోతున్నారు.
ప్రతిష్టాత్మకమైన లహరి మ్యూజిక్ youtube ఛానల్ ద్వారా నిన్ను చేరే తరుణం యొక్క ప్రీ లుక్ వీడియో ను విడుదల చెయ్యబోతున్నారు..
నిన్ను చేరే తరుణం ప్రీ look వీడియో ప్రేక్షకులని ప్రేమకథలో ని ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసి మంత్రం ముగ్దులను చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు..



