సెన్సార్ సన్నాహాల్లో మగువా.. మజాకా

0
185

“వకీల్ సాబ్” చిత్రంలో మగువ పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. అలాగే… రీసెంట్ గా ‘మగువ’ పేరుతో విడుదలైన ఒక ఇండిపెండెంట్ చిత్రం ఓటిటి వేదికపై విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం పాతిక లక్షలకుపైగా వసూలు చేసి అందరి దృష్టి ఆకర్షించింది.

ఇప్పుడు ఈ కోవలో రివెంజ్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం “మగువా మజాకా”. ‘మగువ’లో టైటిల్ రోల్ ప్లే చేసి… ఆ చిత్రం సాధించిన సంచలన విజయంలో కీలక పాత్ర పోషించిన మధుప్రియ.. తాజాగా “మగువా మజాకా” అంటూ… ఆడదంటే అబల కాదు ఆది పరాశక్తి అని చాటబోతున్నారు.

సంపత్ రాజ్ దర్శకత్వంలో స్వప్న మూవీస్ పతాకంపై కె.ఆర్.ఫణిరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని… ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన నలుగురు దుండగులపై ఓ మగువ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుందన్నది క్లుప్తంగా కధాంశం.

రవీంద్ర, రమేష్, క్రిష్, శాండీ, డి.ఎస్.రావు ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్: సంధ్య స్టూడియోస్, ఎడిటర్: వినోద్, కెమెరా: శ్రీను, సంగీతం: పవన్, నిర్మాత: కె.ఆర్.ఫణిరాజ్, రచన-దర్శకత్వం: సంపత్ రాజ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here