సస్పెన్స్ థ్రిల్లర్‌గా `క‌థానిక`‌…ఏప్రిల్ 23 విడుద‌ల‌

0
331

థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లు గా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వం లో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న చిత్రం “కథానిక”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో

నిర్మాత రామరావు లెంక మరియు పద్మలెంక మాట్లాడుతూ “మేము ఈ చిత్రాన్ని కరోనా టైం లో షూటింగ్ చేసాం. మా చిత్ర నటీనటులు, టెక్నీషియన్ అందరు బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. మా డైరెక్టర్ జగదీష్ దుగన అద్భుతంగా చిత్రీకరించారు. మేము ఈ నెల ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు.

దర్శకుడు జగదీష్ దుగన మాట్లాడుతూ “మా కథానిక చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు తెర మీదకి ఈ కథ రాలేదు. మా నిర్మాతలు సినిమా కి ఎంత కావాలో అంత ఖర్చుపెట్టారు. మ్యూజిక్ లొకేషన్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. అందరు చూసి నన్ను ఆశీర్వదించండి” అని తెలిపారు.

హీరో సాగర్ మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. కరోనా టైం లో ఈ చిత్రం లో నాకు అవకాశం వచ్చింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఫామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 23న విడుదల అవుతుంది” అని తెలిపారు.

షేకింగ్ శేషు మాట్లాడుతూ “ఈ చిత్రం లో ఒక చిన్న పాత్ర చేశాను. చాలా బాగుంటుంది. ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ నైనీషా మాట్లాడుతూ “నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన దర్శకుడు జగదీష్ దుగన నిర్మాత శ్రీమతి పద్మ లెంక గారికి నా ధన్యవాదాలు. కరోనా టైం లో సినిమా చిత్రరించాం. ఇప్పుడు ఏప్రిల్ 23 న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది అందరు థియేటర్ లో తప్పక చుడండి” అని తెలిపారు.

బ్యానర్ : థాంక్యూ ఇంఫ్రా టాకీస్

సినిమా పేరు : కథానిక

నటి నటులు : మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, బొంబాయి పద్మ, షేకింగ్ శేషు, కేర్ అఫ్ కంచరపాలెం ఫేమ్ ఉమా మహేశ్వర రావు, అల్లు రమేష్, నల్లా సీను, బేబీ సంజన, కార్తిక్, తదితరులు

కెమెరా మాన్ : హరినాథ్ దేవర

ప్రోగ్రామింగ్ & బి జి యం : తరుణ్ రానా ప్రతాప్

గాయకులు : శ్రీ కృష్ణ, కారుణ్య, దీపు, సురేష్, పావని, జగదీష్ దుగన

సౌండ్ ఇంజినీర్ : వినయ్ కుమార్

ఎడిటర్ : కె యాదగిరి

టైటిల్ & డిజైన్ : అర్ ఫిలిం ఎడిటింగ్

క్రియేటివ్ హెడ్ : మణికంఠ దుగన

పబ్లిసిటీ : ఏం కె ఎస్ మనోజ్

పి అర్ ఓ : పాల్ పవన్

ఆర్ట్ : సతీష్ మరియు పురుషోత్తం

కో డైరెక్టర్ : నిధి బంటుపల్లి

కో ప్రొడ్యూసర్ : రామ రావు లెంక

ప్రొడ్యూసర్ : శ్రీమతి పద్మ లెంక

పోస్ట్ ప్రొడక్షన్ : డ్రీమ్ స్టూడియోస్

స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, లిరిక్స్, మాటలు, దర్శకత్వం : జగదీష్ దుగన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here