రామ్ పోతినేని, లింగుసామి కాంబినేష‌న్ ఫిలింలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్‌

0
316

ప్ర‌స్తుతం వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఆవారా, పందెంకోడి వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మాత‌గా ఓ ఊర మాస్ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో రామ్ స‌ర‌స‌న కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ఈ మేర‌కు విడుద‌ల‌చేసిన రాక్‌స్టార్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

రామ్ పోతినేని కెరీర్‌లో 19వ మూవీగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రం రూపొం దుతోంది. స్టైలిష్ ఎలిమెంట్స్‌తో అవుట్-అండ్-అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుసామి ట్రేడ్‌మార్క్‌తో ఈ చిత్రం ఉండబోతోంది. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు.

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్,
సంగీతం: దేవిశ్రీ‌ప్ర‌సాద్‌,
స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌,
నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి,
ద‌ర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుసామి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here