ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో భారీ చిత్రం

0
274

భారీ అంచనాలతో సిద్ధం అవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “RRR” తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే .

#NTR30 మరియు #NTRKoratala2 గా పిలవబడుతున్న ఈ చిత్రం నందమూరి కళ్యాణ్ రామ్ గారి సమర్పణ లో, మిక్కిలినేని సుధాకర్ నేతృత్వం లో ని “యువసుధ ఆర్ట్స్” మరియు కొసరాజు హరికృష్ణ ఆధ్వర్యం లో ని ” ఎన్టీఆర్ ఆర్ట్స్ ” బ్యానర్ ల పై భారీ స్థాయి లో పాన్ ఇండియా సబ్జెక్ట్ గా నిర్మించబడుతుంది.

ఈ చిత్రం త్వరలోనే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుని, జూన్ ద్వితీయ భాగం లో సెట్స్ పైకి వెళ్తుంది అని నిర్మాతలు తెలిపారు . “ఏప్రిల్ 29, 2022 వ తేదీన పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ పై సహజం గానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయి లో ఈ చిత్రం ఉంటుంది. ఇతర వివరాలను ముహూర్తం రోజున తెలియజేస్తాం” అని నిర్మాతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here