డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి…తనదైన నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుని లవ్లీ రాక్ స్టార్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `శశి`. సురభి, రాశిసింగ్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్నసందర్భంగా లవ్లీ రాక్ స్టార్ ఆది ఇంటర్వ్యూ.
ఈ మూవీ ఎలా స్టార్టయ్యింది?
– నేను హీరోగా చేసిన ‘లవ్లీ’ సినిమాను వైజాగ్‌లో డిస్ట్రిబ్యూట్ చేసిన వర్మగారు కాల్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంది వినమన్నారు. సరే అన్నాను. పరిచయం అయిన తొలిసారే దర్శకుడు శ్రీనివాస్ కథను, అందులోని నా క్యారెక్టరైజేషన్‌ను డీటైల్డ్‌గా చెప్పారు. విన్న వెంటనే ఎగ్జయిట్ అయ్యాను. తప్పకుండా వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
– నా క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉన్నాయి. ఆడియన్స్‌కు డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు. డిప్రెషన్లో ఉండి ఓ ర్యాక్బ్యాండ్ను రన్ చేసే వ్యక్తి పాత్రలో.. సెకండాఫ్‌లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాను. ఈ రెండు క్యారెక్టర్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రేపు ఆడియన్స్ కూడా ఇదే ఫీలవుతారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కు సంబంధించిన బాడీలాంగ్వేజ్, ఎక్స్‌ప్రేషన్స్ వంటి వాటిలో స్పెషల్ కేర్ తీసుకున్నాం. పోస్టర్స్‌లో కనిపించినట్టు ఆ రగ్డ్ లుక్ కోసం నేను రెండు నెలలు కష్టపడ్డాను.
శశి అని టైటిల్ పెట్టడానికి రీజనేంటి?
– శశి అనేది సినిమాలో హీరోయిన్ పేరు. అయితే ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనేది సినిమా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. స్నేహానికి ప్రధాన్యత ఇస్తూ అదే సమయంలో ప్రేమని కూడా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. సురభితో ఇంతకు ముందే ఓ సినిమా చేయాల్సింది. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సురభి మంచి ఛాలెంజింగ్ రోల్లో నటించింది. మరో హీరోయిన్ రాశీసింగ్ ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా నటించింది. ఈ సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. నాకు సపోర్ట్ చేసినవారికి ప్రత్యేక దన్యవాదాలు.
ఈ సినిమాలో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే అంశాలు..?
– ప్రేమలో పడ్డ ఓ మిడిల్‌క్లాస్ కుర్రాడి స్ట్రగుల్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీతో అతనికి రిలేషన్స్ లవ్ తర్వాత ఎలా మారతాయి? అన్న అంశాలు ఆడియన్స్‌కు ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాలో కావాల్సినంత డ్రామా ఉంది. సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఉంటూనే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా 100 పర్సెంట్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో నా బ్రదర్ క్యారెక్టర్ చేసిన అజయ్‌గారు, నా తల్లి పాత్ర చేసిన తులసీగారు, రాజీవ్‌గారు ఈ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. ఫ్యామిలీ యూత్ కనెక్ట్ అయ్యే అంశాలతో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెచ్చుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. అందుకే సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది.
ఒకే ఒక లోకం నువ్వే పాట 50మిలియన్లకి పైగా వ్యూస్ దక్కించుకుంది కదా..ఈ రెస్పాన్స్ ముందే ఊహించారా?
– ‘ఒకే ఒక లోకం నువ్వే…’ సాంగ్ ట్యూన్ విన్నప్పుడే బాగుందని అనిపించింది. చంద్రబోస్‌గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. సిద్ శ్రీరామ్ బాగా పాడారు. సినిమాలో ఈ సాంగ్ ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఉంటుంది. లిరికల్‌గా వీడియో సక్సెస్ అయిన తర్వాత సాంగ్ షూట్లో మార్పులు చేయాలని అనిపించినప్పటికీ శ్రీనివాస్ వద్దన్నారు. ఆ తర్వాత మేం అందరం ఆలోచించి నేచురల్‌గా ఉంటుందని అనుకున్నాం. నా కెరీర్లో ‘ప్రేమకావాలి, లవ్లీ, సుకుమారుడు’ సినిమాల ఆల్బమ్స్‌కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు శ్రీనివాస్ గురించి చెప్పండి?
– దర్శకుడు శ్రీనివాస్ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఈ సినిమాలో పాటల గురించే డిస్కస్ చేశాం. ఐదు పాటలు ట్యూన్స్ విన్నాను. అప్పుడే ‘ఒకే ఒక లోకం..’ పాట కూడ విన్నాను. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అరుణ్ మంచి సంగీతం ఇచ్చారు. ఫస్ట్ విన్నప్పుడు థింతానా థింతానా సాంగ్ నాకు బాగా నచ్చింది.
పవన్ కల్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా…ఏమన్నారు?
– పవన్‌కల్యాణ్‌గారు అంత ఫ్రెండ్లీగా ఉంటారని నేను అనుకోలేదు. ట్రైలర్ చూసి చాలా బాగుంది అన్నారు. ట్రైలర్‌తో పాటు ఒకే ఒక లోకం సాంగ్ కూడ విన్నారు. సాంగ్ క్యాచీగా ఉందని ఆయన కూడా హమ్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
– ప్రస్తుతం ‘జంగిల్ మూవీ చేస్తున్నాను. అది కంప్లీట్ హారర్ మూవీ. మంచి ఫీల్ ఉంటుంది. తర్వాత `బ్లాక్’ అది థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. షమీర్ అనే కొత్త దర్శకుడితో త్వరలో ఒక సినిమా ప్రారంభంకాబోతుంది.
* యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమే. లవ్ అండ్ యాక్షన్ అయితే ఒకే కానీ కంప్లీట్ యాక్షన్ మూవీ అంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తున్నాను. నాకు అయితే వెర్సటైల్ యాక్టర్‌గా అన్నీ పాత్రలు చేయగలడని ఆడియన్స్ మెప్పు పొందాలని ఉంది.



