యూత్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “A1 ఎక్స్ ప్రెస్”. ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి హిప్ అప్ తమిజా సంగీతాన్ని అందించారు. ఈ మూవీ మార్చి5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు టిజి విశ్వప్రసాద్, దయా పన్నెం, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు…
సందీప్ కిషన్ 25వ చిత్రం
ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రానికి రీమేక్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ అయినా మ్యూజికల్‌గా కూడా అక్కడ మంచి పేరొచ్చింది. సందీప్ కిషన్ సజెస్ట్ చేయడంతో ఈ మూవీ రైట్స్ తీసుకొని రీమేక్ చేయడం జరిగింది. సందీప్ కిషన్ కి ఇది 25వ చిత్రం.
అలా చేయడం వల్ల మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుంది.
సురేష్ ప్రొడక్షన్స్‌తో కొలాబ్రేట్ అయ్యి రెండు మూవీస్ చేశాం, అలాగే అభిషేక్ ఆర్ట్స్‌తో ఐదు చిత్రాలు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు ఇరవై మూవీస్ వరకూ ప్రొడ్యూస్ చేస్తే అందులో 15మూవీస్ కొలాబ్రేట్ అయ్యి నిర్మించడం జరిగింది. అలా చేయడం వల్ల కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుంది.
కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
తమిళంలో ఆల్ రెడీ హ్యూజ్ సక్సెస్ అయ్యింది కాబట్టి తెలుగులో కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా కాన్సెప్ట్ తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే మ్యూజిక్ కూడా అందరికీ నచ్చుతుంది. కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉండేలా చూసుకున్నాం.
ఈ మూవీ తర్వాత హాకీని ఇష్టపడే వారి సంఖ్య మరింత పెరుగుతుంది.
చెక్ దే సినిమా చేసిన చండీఘర్ స్టేడియంలో కొంత భాగం షూట్ చేయడం జరిగింది. అలాగే మరికొన్ని నేషనల్ స్టేడియమ్స్‌లో చిత్రీకరించాం. ఇండియాలో స్పోర్ట్స్ అంటే క్రికెట్ అనే స్టేజి నుంచీ మెల్లగా టెన్నిస్, బ్యాడ్మింటన్ వచ్చింది. హాకీ ఆటని కూడా చాలా మంది ఇష్టపడతారు కాని ఆ బ్యాక్ డ్రాప్లో సినిమాలు తక్కువే అని చెప్పాలి. అయితే తెలుగులో హాకీ నేపథ్యంలో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీ తర్వాత హాకీ ఆట ఇష్టపడే వారి సంఖ్య తప్పకుండా మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
100% ఔట్‌పుట్ ఇచ్చాడు.
డెన్నిస్ చేసిన షార్ట్ ఫిలిం నచ్చి ఈ మూవీ అవకాశం ఇవ్వడం జరిగింది. తను ఫుల్ ఎఫర్ట్‌తో 100% ఔట్‌పుట్ ఇచ్చాడు. అందుకే మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రేపు థియేటర్‌లలో ఆడియన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
పోస్ట్ ప్రొడక్షన్ బెటర్‌గా చేశాం
ముందుగా ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాని కరోనా వల్ల వాయిదా పడింది. లాక్ డౌన్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కొంచెం బెటర్‌గా చేసి సినిమాని మంచి ఔట్‌పుట్‌తో మీ ముందుకు తీసుకువస్తున్నాం.
సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది
ఈ మూవీ తమిళ్ వెర్షన్‌కి హిప్ఆప్ మ్యూజిక్ డైరెక్టర్. అందుకే తెలుగులో కూడా అతన్నేతీసుకోవడం జరిగింది. వెరీ క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు. ఆల్ రెడీ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేపు సినిమా రిలీజయ్యాక ఆర్ ఆర్ కి కూడా మంచి పేరొస్తుందని నమ్ముతున్నాము.
వారిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది
మీరు టీజర్, ట్రైలర్ చూసినట్లయితే ఈ మూవీ కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే కాదు లవ్, కామెడీ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్ధం అవుతుంది. ముఖ్యంగా సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కెమిప్ట్రి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
ఇంకా ఎక్కువ థియేటర్‌లలో రిలీజ్
థియేటర్‌ల సంఖ్య ఇంకా కన్‌ఫామ్ కాలేదు. కాకపోతే మేం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ థియేటర్‌లలో రిలీజ్ అవబోతుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో మొదలవుతుంది. శ్రీ విష్ణు `రాజరాజచోర` రిలీజ్ కి రెడీగా ఉంది. నితిన్ `పవర్‌పేట` మూవీ త్వరలో స్టార్ట్ అవుతుంది. సునీల్ తో `మర్యాద కృష్ణయ్య` అనే మూవీ చేశాం. అది కూడా రిలీజ్‌కి రెడీగా ఉంది. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో `కార్తికేయ-2` చేస్తున్నాం. అలాగే `పలాన అబ్బాయి, పలాన అమ్మాయి` మూవీ షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయ్యింది. ఓవర్‌సిస్ బ్యాలెన్స్ ఉంది. అలాగే తమిళంలో `ఆర్టికల్21` అని శ్రద్దా శ్రీనాథ్‌తో ఒక సినిమా రెడీగా ఉంది. ప్రభు సోలోమన్ అసోసియేట్ డైరెక్టర్‌తో సాలా అనే మూవీ చేస్తున్నాం. ఇవే కాకుండా మరో పదిహేను ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేజెస్‌లలో ఉన్నాయి.



