“క్షణక్షణం” మూవీ థాంక్స్ మీట్

0
36

మన మూవీస్ పతాకంపై ఉదయ్ శంకర్, జియా శర్మ జంటగా నటించిన సినిమా క్షణక్షణం. ఈ చిత్రాన్ని డాక్టర్ వర్లు, చంద్రమౌళి నిర్మించారు. కార్తీక్ మేడికొండ రూపొందించిన ఈ డార్క్ కామెడీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితం అవుతోన్న సందర్భంగా క్షణక్షణం సినిమా యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ…సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు మీడియా, ఆడియెన్స్ వారికి థ్యాంక్స్. అల్లు అరవింద్, బన్నీవాస్ గారు మా సినిమా రిలీజ్ కు ఎంతో సహకరించారు. జియా శర్మకు అర్జున్ రెడ్డి తర్వాత అంత మంచి పేరు క్షణక్షణం చిత్రంతో వస్తోంది. ఉదయ్ కు మరోసారి గుర్తింపు తీసుకొచ్చిందీ చిత్రం. భవిష్యత్ లోనూ ఉదయ్ కు మీ సహకారం అందుతుందని ఆశిస్తున్నా. కళారంగంలో ఉండేవారికి అంకెలతో సంబంధం లేదు. ఇక్కడ పూర్తి ప్రయత్నం పెట్టడమే విజయం. శక్తివంచన లేకుండా సినిమా బాగా వచ్చేందుకు కృషి చేశారు. మూవీకి ఎన్ని డబ్బులు వస్తాయని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన శక్తి సామర్థ్యాలు పెట్టామా లేదా అనేదే చూసుకోవాలి. అలా క్షణక్షణం మొత్తం టీమ్ కష్టపడ్డారు. అన్నారు.

దర్శకుడు కార్తీక్ మేడికొండ మాట్లాడుతూ…క్షణక్షణం మూవీని ఆదరించిన ఆడియెన్స్ కు చాలా థ్యాంక్స్. మేము మొదటి నుంచి క్లైమాక్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాం కానీ ఇవాళ అదే క్లైమాక్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము నమ్మి చేసిన కథ ప్రేక్షకులకు రీచ్ అ‌వడం సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ ఉదయ్ చాలా సహజంగా నటించాడు. జియా శర్మ క్యారెక్టర్ కు మంచి అప్లాజ్ వస్తోంది. అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నారు. పాజిటివ్ బజ్ వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. వీకెండ్ కాబట్టి థియేటర్లో సినిమాను చూడండి. వర్లు గారు, చంద్రమౌళి గారు సినిమాను గ్రాండ్ గా మీ ముందుకొచ్చారు. మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఇంత మంచి అప్లాజ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఈ వారం పది సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మా క్షణక్షణం చిత్రానికి ఆడియెన్స్ ఆదరణ బాగుంది. బన్నీవాస్ గారు, అరవింద్ గారు లేకుంటే ఇవాళ మా సినిమా రిలీజ్ అయ్యేదే కాదు. ఇన్ని థియేటర్స్ దొరికేవి కాదు. జియా శర్మ చాలా నేచురల్ గా నటించింది. క్షణక్షణం టీమ్ మొత్తం నుంచి ఆడియెన్స్, మీడియాకు థ్యాంక్స్. సినిమా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

గిఫ్టన్ మాట్లాడుతూ…మాకు సపోర్ట్ చేసిన మీడియాకు థ్యాంక్స్. వర్లు గారు, మౌళి గారు నన్ను ఈ సినిమాలో కి తీసుకోవడం సంతోషంగా ఉంది. మొత్తం టీమ్ కు కంగ్రాట్స్. అన్నారు.

నాయిక జియా శర్మ మాట్లాడుతూ…క్షణక్షణం మూవీలో పనిచేసిన అనుభవాలను మర్చిపోలేను. ఈ చిత్రం నాకెంతో నేర్పించింది. ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ టీమ్ మొత్తానికి థ్యాంక్స్. అర్జున్ రెడ్డి చిత్రం నుంచి నాకు సపోర్ట్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మిమ్మల్ని నా రాబోయే చిత్రాలతోనూ అలరిస్తానని మాటిస్తున్నాను. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here