‘క్షణక్షణం’ క్లైమాక్స్ ట్విస్ట్ ఎవ‌రూ ఊహించలేరు – హీరో ఉదయ్ శంకర్

0
390

‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్‌ హీరోగా, జియా శర్మ హీరోయిన్‌గా కార్తీక్‌ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. మన మూవీస్ ప‌తాకంపై డాక్టర్‌ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించారు. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరో ఉద‌య్ శంక‌ర్ ఇంట‌ర్వ్యూ..

ఒక హీరోగా ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియ‌న్స్ నిచ్చింది?
– నేను గతంలో రెండు చిత్రాలు `ఆటగదరా శివ`, `మిస్ మ్యాచ్`లో హీరోగా చేశాను. ఆటగదరా శివ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఆ చిత్రానికి అత్యధిక వ్యూయింగ్ వచ్చినట్లు ఈ మధ్య బన్నీ వాస్ గారు చెప్పారు. మూడో చిత్రంగా క్షణక్షణం చిత్రం చేశాను. సినిమా బాగా వ‌చ్చింది. మేము ఎలాగైతే సినిమా బాగుంద‌ని ఫీల్ అయ్యామో..ఆడియ‌న్స్ కూడా అలాగే అనుకుంటార‌ని న‌మ్ముతున్నాను.

ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట‌య్యింది?
– ఈ సినిమా క‌థ నేను జూన్‌లో విన్నాను. క‌థ బాగా న‌చ్చి వెంట‌నే ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ స్టార్ట్ చేసి ఆగ‌స్ట్‌లో షూటింగ్ ప్రారంభించాం. సినిమా అంతా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రుగుతుంది. క‌రోనా కార‌ణంగా ఇండోర్ పార్ట్ మొత్తం హైద‌రాబాద్‌లో షూట్ చేసి ఆ త‌ర్వాత వైజాగ్‌లో ఔట్‌డోర్ పార్ట్ కంప్లీట్ చేశాం. ఈ సినిమా ర‌న్ టైమ్ రెండుగంట‌లు మాత్ర‌మే.చాలా క్రిస్పీగా క‌థ‌కు ఎంత అవ‌స‌ర‌మో అంతే ఎడిట్ చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగా వ‌చ్చింది. చివరి 20 నిమిషాల ట్విస్ట్ ఎవ‌రూ ఊహించలేరు. రీసెంట్‌గా బ‌న్నీవాస్‌గారు సినిమా చూశారు. ఆయ‌న‌కి కూడా చివరి ఇరవై నిమిషాలు బాగా నచ్చింది. నా కెరీర్‌లో ఎన్నో సినిమాలు చూశాను ఉద‌య్ కాని అస‌లు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఊహించలేదు అన్నారు. ఆడియెన్స్ థియేటర్ కు రావాలి లేకపోతే ఒక మంచి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. ప్రమోషన్ బాగా చేస్తున్నాం. గీతా ఫిలింస్ వారు వీలైనంత ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు.

ఈ క‌థ‌లో మిమ్మ‌ల్ని ఇన్స్‌పైర్ చేసిన పాయంట్స్ ఎంటి?
– నా జీవితంలో జరిగిన ఘటనలు కొన్ని ఈ కథలో రిలేట్ అయ్యాయి. హీరో క్యారెక్టరైజేషన్ నాజీవితంతో పోల్చుకున్నాను. నాకే కాదు చాలా మందికి ఇలా జరుగుతుంటాయి. ఇంట్లో, బయటా రిజెక్షన్స్ వస్తుంటాయి. పదీ పదిహేనేళ్లుగా నా జీవితంలో కూడా ఇలాంటివే జరిగాయి కాబట్టి న‌న్ను నేను ఊహించుకుని నటించాను. అందుకే పెద్దగా కష్టంగా అనిపించ‌లేదు.

టైటిల్ జస్టిఫికేష‌న్ ఏంటి?
– షూటింగ్ అంతా పూర్త‌య్యాక ఒక టైటిల్ అనుకున్నాం. కాని ఆ టైటిల్ మా డైరెక్ట‌ర్ గారికి అంత‌గా న‌చ్చ‌లేదు. వెంట‌నే క్షణక్షణం టైటిల్ ఎలా ఉంటుంది ఉద‌య్ అని అన్నాడు. అది వెంకటేష్ గారి పెద్ద హిట్ సినిమా. ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం ఎందుకులే అని అన్నాను. లేదు ఉద‌య్ ఆ టైటిల్‌ నేను బజ్ కోసం పెట్టడంలేదు… చూడగానే టైటిల్ ఫ‌స్ట్ జ‌నాల్లోకి వెళ్తుంది, అటెష‌న్స్ గ్రాస్ అవుతుంది అన్నారు. క్షణక్షణం టైటిల్ కథకు ప‌ర్‌ఫెక్ట్‌గా యాప్ట్ అని నేను కూడా ఆలోచించాను . స‌రే చూసుకో ఆ టైటిల్‌కి ఫ్యాన్స్ ఉన్నారు మరి అని చెప్పాను. లేదు సినిమా ఎవ్వ‌రిని డిస‌ప్పాయంట్ చేయ‌దు అని ఆ టైటిల్ పెట్టారు.

ఈ సినిమా ఏ జోన‌ర్‌లో ఉంటుంది?
– ఈ సినిమా డార్క్ హ్యూమర్ డ్రామా థ్రిల్ల‌ర్ అని చెప్పొచ్చు. మా కథకు కామెడీ కావాలని యాడ్ చేస్తే అసహజంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్ నుంచే కామెడీ పుడుతుంది. హీరో బాధలే ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. అలాగే కోటి గారితో నా ఫస్ట్ మూవీ. లాయర్ క్యారెక్టర్ చేశారు. వాళ్ల‌బ్బాయి రోషన్ సాలూరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. మ్యూజిక్ బాగాచేశారు. ఆయన నిర్మల కాన్వెంట్ చిత్రానికి బాగా మ్యూజిక్ చేయ‌డంతో డైరెక్ట‌ర్ ఈ సినిమాకి కూడా తీసుకున్నారు. కోటిగారు నటిస్తుంటే రోషన్ రీ రికార్డింగ్‌ చేయడం ఒక రేర్‌ ఎక్సీపిరియన్స్. కోటి గారు సీన్ పేపర్ తీసుకుని క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేశారు.

కార్తీక్ కథ చెప్పినప్పుడు, సినిమా పూర్త‌య్యాక‌ చూసినప్పుడు అదే ఔట్‌పుట్ వచ్చిందా?
– ఖ‌చ్చితంగా ఆయ‌న చెప్పిన ఔట్‌పుట్ అయితే వ‌చ్చింది. ఈ కథను మేము ప్రీ ప్రొడ‌క్ష‌న్‌లో ఎలా తీయాలి అనుకున్నామో అలానే చేయాలి. అనుకున్నదానికంటే ఎక్కువ చేసినా సమస్యే. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసినా ఆ ఫ్లేవ‌ర్ పోతుంది. అందుకే ఎక్కువ చేయకుండా ఖచ్చితంగా అనుకున్నట్లే చేశాం. అందుకే ఒక గంట యాబై రెండు నిమిషాల నిడివి మాత్ర‌మే ఉంటుంది.

నిర్మాత‌ల గురించి చెప్పండి?
– మౌళిగారు వన్ ఆప్ ద ప్రొడ్యూసర్. కోవిడ్ టైమ్ లో ఫిష్ హార్బర్ లో సినిమా షూటింగ్ చేయాలి. వర్లు గారు, మౌళి గారు లేకుంటే మా సినిమా షూటింగ్ అయ్యేది కాదు. మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. ఉన్నవారికంటే ఇంకా ఎక్కువే తీసుకొచ్చి పెట్టారు. మా టీమ్ అంద‌రినీ ఒక స్వంత ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లా చూసుకున్నారు. వారి ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా చేయ‌డం హ్యాపీ.

లెక్కల్లో మీరు జీనియస్ క‌దా! సినిమా లెక్క‌లు మీకు ఏమైనా అర్ధం అయ్యాయా?
– నేను లెక్కల్లో జీనియస్ గానీ, సినిమా లెక్కలు అస్సలు తెలియవు.

జియా శర్మతో వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
– జియా శర్మ నా భార్య క్యారెక్టర్ చేసింది, ఎప్పుడూ మాకు గొడవలు జరుగుతుంటాయి. ఒక సమస్య నుంచి బయటకు రాగానే మరో సమస్యలో హీరో పడతాడు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. మేము ఏం చేసినా సినిమా జనాలు చూడాలి. ఫస్టాఫ్ సినిమా బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి అస‌లు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చివరి దాకా సినిమా ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్‌న‌ కూర్చోబెడుతుంది. కోటి, రఘు కుంచె, గిఫ్టన్ ఈ ముగ్గురు సంగీత దర్శకులు మా సినిమాలో నటించడం కో ఇన్సిడెంట్.

రేపు సినిమా రిలీజ‌వుతుంది కదా ఆడియ‌న్స్‌కి ఏం చెప్తారు?
– రొటీన్ సినిమాలు కొత్త హీరోలు చేస్తే ఆడియ‌న్స్ చూడరు. కొత్తగా ట్రై చేసే హీరోలు డిఫరెంట్ కథలు ఎంచుకోవాలి, విజయ్ సేతుపతి, ఆయుశ్మాన్ ఖురానా లాంటి వాళ్లు బాలీవుడ్ లో అదే ప్రయత్నం చేశారు. ఈ హీరో సినిమా వస్తుందంటే ఏదో ఓ కొత్త కథ ఉంటుంది. మంచి పెర్‌ఫామెన్స్‌లు ఉంటాయి అని పేరొస్తే చాలు. ఉదయ్ సినిమా వస్తుందంటే ఏదో కొత్త కథ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకోవాలని ఉంది. ఈ సినిమాలో హీరో చుట్టూ ఉండే మ‌రో ఆరు పాత్ర‌లే చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో ఎవ‌రు దొంగ అని క‌నిపెట్ట‌గ‌లిగితే సూప‌ర్‌.

* హీరోగా చేయాలనేది నా కోరిక దాంతో పాటు కథలో మంచి ఇంపార్టెంట్స్ ఉంటే క్యారెక్టర్స్ చేసేందుకైనా సిద్ధమే. ఒక సఖి, గీతాంజలి, ఓకే బంగారం లాంటి ఫీల్ గుడ్ ప్రాపర్ లవ్ స్టోరీలో నటించాలని ఉంది అంటూ ఇంట‌ర్వ్యూ ముగించారు హీరో ఉద‌య్‌ శంక‌ర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here