రాక్‌స్టార్ కి మెగాస్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్

0
190

మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ఉప్పెన‌. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా ఈ సినిమా విడుద‌లై సూప‌ర్‌స‌క్సెస్‌ని సాధించిన విష‌యం తెలిసిందే. ఓ జంట ప్రేమప్రయాణానికి అద్భుత‌మైన దృశ్య‌రూపంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం ఒక హైలెట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌ని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ఒక మ్యూజిక‌ల్ గిఫ్ట్‌తో పాటు ఒక లేఖ‌ని పంపారు. ఆ లేఖ‌లో..

Dear DSP,
ఎగిసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాష‌న్ తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్ కి అంతే ప్యాష‌న్‌తో మ్యూజిక్ నిస్తావ్‌. నీలో వుండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. God Bless Devi! You Truly are a Rock Star!..ప్రేమతో చిరంజీవి.

ఈ ప్రశంసకు మెగాస్టార్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ దేవి శ్రీ ప్రసాద్ ఒక వీడియో పోస్ట్‌చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here