నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నెల 23 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5:04 గంటలకు ‘టక్ జగదీష్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ మోషన్ పోస్టర్‌ను కూడా సంస్థ షేర్ చేసింది. ఈ మోషన్ పోస్టర్‌లో యాక్షన్ మోడ్‌లో ఉన్న నాని ఆకట్టుకుంటున్నారు. ఓ విలేజ్‌లోని తాటితోపు దగ్గర చుట్టూ జనం నిల్చొని చూస్తుండగా, చేతిలో బాణాకర్ర పట్టుకొని ప్రత్యక్షమయ్యారు టైటిల్ రోల్ చేస్తున్న నాని. రౌడీల భరతం పట్టడానికి ఆయన రెడీ అయ్యారని ఊహించవచ్చు. తమన్ ఇచ్చిన బీజియం ఉద్వేగభరితంగా ఉంది. ఈ మోషన్ పోస్టర్‌తో నాని క్యారెక్టరైజేషన్ ఏమిటనే ఆసక్తి పెరిగింది.
ఇటీవల విడుదల చేసిన “ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి” అంటూ సాగే మెలోడీ డ్యూయెట్ లిరికల్ వీడియోకు సంగీత ప్రియుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా శివ నిర్వాణ చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, వెంకట్ ఫైట్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తారాగణం:
నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్, నాజర్, జగపతి బాబు, రావు రమేష్, నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
కో- డైరెక్టర్: లక్ష్మణ్ ముసులూరి
క్యాస్టూమ్ డిజైనర్: నీరజ కోన