“బొమ్మ అదిరింది” దిమ్మ తిరిగింది” ఫ్యామిలీ అందరూ కలసి చూడదగ్గ సినిమా – హీరోయిన్ ప్రియ

0
490

మ‌హంకాళి మూవీస్, మ‌హంకాళి దివాక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో, మ‌ణిదీప్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై లుకాల‌పు మ‌ధు, సోమేశ్ ముచ‌ర్ల నిర్మాత‌లుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న రొమాంటిక్ హార‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’’నూత‌న ద‌ర్శ‌కుడు కుమార్ కోట ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. షకలక శంకర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ సందర్భంగా హీరోయిన్ ‘ప్రియ’తో ఇంటర్వ్యూ…

నేను పక్కా తెలుగమ్మాయి, మంచి సినిమాలో నటించాలని చూస్తున్న సందర్భంలో డైరెక్టర్ కుమార్ తోట గారు నాకు ఈ కథ చెప్పారు. కథ విని వెంటనే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. షూటింగ్ సమయంలో షకలక శంకర్, దర్శక,నిర్మాతల సహకారం మరచిపోలేము. నాకు షకలక శంకర్ గారు గత ఐదు ఏళ్లుగా బాగా తెలుసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను.

ఎక్కడా బోరింగ్ లేకుండా సరదాగా రెండు గంటలు ఈ సినిమా చూసి నవ్వుకోవచ్చు. సినిమాలో వచ్చే ట్విస్టులు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయి. బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది వంటి మంచి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది.

నిర్మాతలు మహంకాళి దివాకర్, లుకారపు మధు, సోమేశ్ ముచర్ల గార్ల సినిమాను ఎక్కడా రాజీ పడకుండా రిచ్ గా నిర్మించారు. డైరెక్టర్ కుమార్ కోట నూతన దర్శకుడైనా అనుభవం కలిగిన డైరెక్టర్ లా సినిమాను తెరకెక్కించారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటిస్తున్నాను. అలాగే రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు తెలుపుతాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here